ఢిల్లీ బీజేపీకి భారీ షాక్‌.. ఓ వైపు ఈసీ దెబ్బ.. మరో వైపు…

ఢిల్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. ఓ వైపు అధికార ఆప్.. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి హరిశరణ్ సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. హరిశరణ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల ఆయనకు బీజేపీ […]

ఢిల్లీ బీజేపీకి భారీ షాక్‌.. ఓ వైపు ఈసీ దెబ్బ.. మరో వైపు...
Follow us

| Edited By:

Updated on: Jan 26, 2020 | 12:56 PM

ఢిల్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. ఓ వైపు అధికార ఆప్.. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి హరిశరణ్ సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. హరిశరణ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకుండా తిరస్కరించింది. ఆయన స్థానంలో తజీందర్ పాల్ సింగ్ బగ్గాకి సీటు కేటాయించారు. దీంతో అసహనానికి గురైన హరిశరణ్.. బీజేపీ గుడ్‌బై చెప్పి.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆప్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హరిశరణ్ మీడియాతో మాట్లాడుతూ… కేజ్రీవాల్ ఢిల్లీని ఓ అమ్మలా పాలిస్తున్నారని కొనియాడారు. విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాల్లో తనదైన ముద్రను వేసుకున్నారని.. ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ వద్ద ఓ మంచి రూట్‌మ్యాప్ ఉందన్నారు.

ఇదిలా ఉంటే.. అత్యంత కీలక సమయంలో బీజీపీ అభ్యర్ధికి ఈసీ ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి కపిల్ మిశ్రా ఎన్నికల ప్రచారంపై ఈసీ 48 గంటల పాటు నిషేధం విధించింది. శనివారం సాయంత్రం 5.00 గంటల నుంచి 48 గంటల పాటు.. ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంది. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్టులు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఢిల్లీలో జరిగేది భారత్ వర్సెస్ పాకిస్థాన్ అంటూ పోస్ట్ చేయడంతో.. ఆప్ ఈసీని ఆశ్రయించింది. ట్వీట్ వివాదాస్పదం కావడంతో.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేశారు.