సీ ఓటర్ సర్వే ఫలితాలు.. మ్యాజిక్ ఫిగర్ కష్టమే

దేశమంతా ఎలక్షన్ హీట్.. వేసవి వేడిని మించిపోతోంది. ఈ నెల 11వ తేదీన తొలి దశ పోలింగ్ జరగనుంది. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈలోగా వివిధ సంస్థలు ఓటరు నాడి తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఏ కూటమికీ మ్యాజిక్ ఫిగర్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 543సీట్లు ఉన్న లోక్‌సభ‌లో సాధారణ మెజారిటీ రావాలంటే కనీసం 272సీట్లు సాధించాలి. అయితే బీజేపీ నాయకత్వాన ఉన్న […]

సీ ఓటర్ సర్వే ఫలితాలు.. మ్యాజిక్ ఫిగర్ కష్టమే
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2019 | 2:40 PM

దేశమంతా ఎలక్షన్ హీట్.. వేసవి వేడిని మించిపోతోంది. ఈ నెల 11వ తేదీన తొలి దశ పోలింగ్ జరగనుంది. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈలోగా వివిధ సంస్థలు ఓటరు నాడి తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఏ కూటమికీ మ్యాజిక్ ఫిగర్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 543సీట్లు ఉన్న లోక్‌సభ‌లో సాధారణ మెజారిటీ రావాలంటే కనీసం 272సీట్లు సాధించాలి. అయితే బీజేపీ నాయకత్వాన ఉన్న ఎన్డీఏకు 261స్థానాలు మాత్రమే వస్తాయని సర్వే చెబుతోంది. అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమికి 143 సీట్లు, ఇతరులకు 139సీట్లు రావొచ్చని సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కూటమికి మెజారిటీ సీట్లు రావొచ్చని సర్వే తెలిపింది. ఇక్కడ ఎన్డీఏకు 28సీట్లు, యూపీఏకు 4సీట్లు మాత్రమే దక్కనున్నాయి. ఈ రాష్ట్రంలోనే బీజేపీ భారీగా నష్టపోవచ్చని సర్వే అంచనా వేసింది. బీహార్‌లో ఎన్డీఏకు 36, యూపీఏకు 4.. గుజరాత్‌లో ఎన్డీఏకు 24, యూపీఏకు 2.. మహారాష్ట్రలో ఎన్డీఏకు 34, యూపీఏకు 14.. మధ్యప్రదేశ్‌లో ఎన్డీఏకు 23, యూపీఏకు 6.. రాజస్థాన్‌లో ఎన్డీఏకు 17, యూపీఏకు 6.. ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్డీఏకు 5, యూపీఏకు 6 స్థానాలు లభించబోతున్నాయని సర్వే పేర్కొంది.

వీటితో పాటు బెంగాల్ రాష్ట్రంలో ఎన్డీఏకు 8, తృణమూల్ కాంగ్రెస్‌కు 34 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ఇక్కడ దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతాయని ఆ సర్వే అభిప్రాయపడింది. ఇక ఒడిశాలో ఎన్డీఏ 11 సీట్లు, బిజూ జనతాదళ్ 10సీట్లు గెలుచుకుంటుందని సర్వే చెబుతోంది. ఢిల్లీలో ఎన్డీఏ మొత్తం ఏడు సీట్లు దక్కించుకుంటుందని తెలుస్తోంది. అలాగే హర్యానాలో ఎన్డీఏకు 7, యూపీఏకు 3.. పంజాబ్‌లో ఎన్డీఏకు ఒక స్థానం, యూపీఏకు 12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వే ప్రకటించింది.

ఇక దక్షిణ భారత రాష్ట్రాల్లో సర్వే ఫలితాలను రాష్ట్రాల వారీగా ఇవ్వలేదు. మొత్తం ఆరు రాష్ట్రాల్లో కలిపి ఎన్డీఏకు 23, యూపీఏకు 62సీట్లు.. ఇతరులకు 45సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీఏకు 13, యూపీఏకు 10, ఇతరులకు రెండు సీట్లు దక్కుతాయని సీ ఓటర్ సర్వే తెలిపింది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..