చైనాపై మీరు చేసిన నిర్వాకమేమిటి ? ఆ దేశానికి మీరు లొంగిపోలేదా ? రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం

అరుణాచల్ ప్రదేశ్ లో భారత భూభాగాన్ని కొంతమేర ఆక్రమించుకుంటూ చైనా గ్రామాన్ని నిర్మించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడడం..

చైనాపై మీరు చేసిన నిర్వాకమేమిటి ? ఆ దేశానికి మీరు లొంగిపోలేదా ? రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 19, 2021 | 4:18 PM

అరుణాచల్ ప్రదేశ్ లో భారత భూభాగాన్ని కొంతమేర ఆక్రమించుకుంటూ చైనా గ్రామాన్ని నిర్మించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడడం మీద బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. మీరు అన్నీ అబధ్ధాలే చెబుతున్నారని, నెలరోజుల విదేశీ వెకేషన్ తరువాత తిరిగి వఛ్చి ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. నాడు పండిట్ నెహ్రూ ఇప్పుడు మీరు చెబుతున్న అరుణాచల్ లోని భూమితో సహా వేలాది ఎకరాల భూమిని చైనాకు ధారాదత్తం చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. మీ హయాంలో డ్రాగన్ కంట్రీకి మీరు ఎన్నిసార్లు లొంగిపోలేదు ? ఆ దేశానికి అనుకూల విధానాలు పాటించలేదా అన్నారు.. ఇక మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రైతులపట్ల జాలి, కరుణ కలుగుతాయా, మీ కాంగ్రెస్ హయాంలో మీరు సరైన చర్యలు తీసుకుని ఉంటే అన్నదాతలు నేడు ఇంత దయనీయ స్థితిలో ఉండేవారు కారని నడ్డా పేర్కొన్నారు. వారి మేలు కోసం కేంద్రం చర్యలు తీసుకుంటే విమర్శిస్తారా అన్నారు. కరోనా వైరస్ పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రభుత్వం, వైద్య సిబ్బంది ఇంతగా కృషి చేసి..ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి  దేశం కోలుకుంటుంటే ప్రభుత్వాన్ని, వైద్య సిబ్బందిని, హెల్త్ కేర్ వర్కర్లను, ఈ దేశంలోని 130 కోట్లమందిని అభిందించాలన్న యోచన కూడా మీకు లేకపోయిదన్నారు.

టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
ఆధార్‌కు మొబైల్ లింక్ చేయడం ఎలా? చాలా సింపుల్..
ఆధార్‌కు మొబైల్ లింక్ చేయడం ఎలా? చాలా సింపుల్..