అవకాశవాదులను తిప్పికొట్టిన బిజెపి

తమ రాష్ట్రంలో ఇక రాష్ట్రపతి పాలన కొనసాగదు.. ఓ సుస్థిర ప్రభుత్వం తమను పాలించబోతోందన్న శుభవార్తతో మహారాష్ట్ర ప్రజలు శనివారం నిద్రలేచారు. మహారాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పుకు భిన్నంగా జత కట్టిన కాంగ్రెస్-శివసేన పార్టీలు బిజెపి కొట్టిన వ్యూహాత్మక దెబ్బకు కుదేలయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా 75 శాతం స్ట్రైకింగ్ రేటుతో చారిత్రాత్మక తీర్పునిచ్చారు మహారాష్ట్ర ప్రజలు. శివసేనతో పొత్తులో భాగంగా బిజెపి పోటీ చేసిన 150 సీట్లకు గాను 105 సీట్లలో […]

అవకాశవాదులను తిప్పికొట్టిన బిజెపి
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 3:01 PM

తమ రాష్ట్రంలో ఇక రాష్ట్రపతి పాలన కొనసాగదు.. ఓ సుస్థిర ప్రభుత్వం తమను పాలించబోతోందన్న శుభవార్తతో మహారాష్ట్ర ప్రజలు శనివారం నిద్రలేచారు. మహారాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పుకు భిన్నంగా జత కట్టిన కాంగ్రెస్-శివసేన పార్టీలు బిజెపి కొట్టిన వ్యూహాత్మక దెబ్బకు కుదేలయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా 75 శాతం స్ట్రైకింగ్ రేటుతో చారిత్రాత్మక తీర్పునిచ్చారు మహారాష్ట్ర ప్రజలు. శివసేనతో పొత్తులో భాగంగా బిజెపి పోటీ చేసిన 150 సీట్లకు గాను 105 సీట్లలో విజయంతో ఆశీర్వదించి, గొప్ప తీర్పు చెప్పారు మహారాష్ట్రీయులు.

అధికారం కోసం తహతహలాడిన శివసేన కథకు తెరదించేందుకు శనివారం ఉదయం ఒక నాందీ ప్రస్తావన పలికింది. ఎన్నికలకు ముందే కుదిరిన ఇరు పార్టీల ఒప్పందాన్ని ముఖ్యమంత్రి సీటు కోసం నర్మగర్భంగా ఉల్లంఘించిన శివసేన త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోబోతోంది. ఇటీవలి పరిణామాలలో శివసేన సిద్దాంత పరంగా కూడా అంతగా కమిటెడ్ కాదన్న విషయం.. ఈ ఓటమితో మహారాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది.

ఇన్నాళ్ళు సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా దేశ ప్రజలకు ఈ సందర్బంగా బిజెపి పిలుపునిస్తోంది. సిద్దాంతపరంగా నిస్తేజమైన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా కప్పుకున్న లౌకిక వాద ముసుగు.. తాజా పరిణామాలలో తొలగిపోయింది. నాలుగు దశాబ్దాలుగా శివసేన పార్టీని మతతత్వ పార్టీగాను, అలౌకిక పార్టీగాను ఆరోపిస్తూ.. ఆ పార్టీతో పోరాడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరికి అధికార దాహంతో అదే పార్టీతో అంటకాగేందుకు సిద్దపడిందని నిరూపితమైంది. ఏదో రకంగా అధికారం సాధించాలన్న కాంగ్రెస్ పార్టీ అధికార కాంక్ష గత పదిహేను రోజులుగా జరిగిన పరిణామాలతో తేటతెల్లమైంది.

ఎన్సీపీ నుంచి వచ్చిన చీలిక వర్గంతోపాటు దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతిస్తున్న ఇండిపెండెంట్లతో కలిసి బిజెపి పూర్తిగా అయిదేళ్ళ పాటు మహారాష్ట్రలో సుస్థిర, పటిష్ట, ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని అందించబోతోంది. ప్రతీ సారిలాగనే.. ఈసారి కూడా ప్రజా తీర్పును తోసిపుచ్చి, అధికార కాంక్షతో సిద్దాంతాలను కూడా పదవుల కోసం పక్కన పెట్టిన పార్టీల కుట్రలను, ఎత్తుగడలను బిజెపి తిప్పికొట్టింది.

NOTE: రచయిత తెలంగాణ బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి, వ్యూహకర్త మరియు గ్లోబల్ లీడర్ షిప్ కోచ్.
Disclaimer: ఈ ఆర్టికల్‌లోని అంశాలు రచయిత సొంత అభిప్రాయాలు..వాటిని టివీ9 ఛానల్, టీవీ9 వెబ్‌సైట్ అభిప్రాయాలుగా పరిగణించ వద్దని మనవి.