ప్రతిపక్షానికి ఓ దశ, దిశ లేకుండా పోయింది…

JP Nadda Has Lashed Out : ప్రతిపక్షానికి ఓ దశ, దిశ లేకుండా పోయిందని కాంగ్రెస్‌ పార్టీనుద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ప్రధాని మోదీపై ఉన్న వైరంతో దేశాన్నే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దును తప్పుబడుతున్న కాంగ్రెస్‌ నేతలు.. పరోక్షంగా పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. రాజస్తాన్ చెందిన పార్టీ నేతలతో నడ్డా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు […]

  • Sanjay Kasula
  • Publish Date - 11:47 pm, Sun, 25 October 20

JP Nadda Has Lashed Out : ప్రతిపక్షానికి ఓ దశ, దిశ లేకుండా పోయిందని కాంగ్రెస్‌ పార్టీనుద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ప్రధాని మోదీపై ఉన్న వైరంతో దేశాన్నే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దును తప్పుబడుతున్న కాంగ్రెస్‌ నేతలు.. పరోక్షంగా పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. రాజస్తాన్ చెందిన పార్టీ నేతలతో నడ్డా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్టికల్‌ 370 రద్దు చేసినందుకు దేశమంతా పండగ చేసుకుంటూ ఉంటే.. రాహుల్‌ గాంధీ దాన్ని అన్యాయం అంటున్నారని నడ్డా అన్నారు. ప్రతిపక్షానికి ఒక దిశ లేకపోవడం బాధాకరమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. దేశాన్ని రక్షించేందుకు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.