ప్రభుత్వ తీరుతో ఇన్వెస్టర్లు పారిపోతున్నారు : సుజనా

Srujana Chowdary

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇన్వెస్టర్లు పారిపోతున్నారని ఆయన ఆరోపించారు. పరిశ్రమల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుజనా చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నిర్ణయం రాజ్యాంగవిరుద్ధమని అన్నారు. స్థానికుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సుజనా చౌదరి సూచించారు. ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఇన్వెస్టర్లు ఉద్యోగాలు ఇవ్వలేక, కంపెనీలు పెట్టలేక ఇబ్బందిపడుతున్నారని ఆరోపించారు.

ఇసుక కొరత, అమరావతి నిర్మాణం అన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులే అన్నారు. పోలవరంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అభివర్ణించారు. పోలవరం విషయంలో కాంట్రాక్టర్ ఎవరన్నది ముఖ్యంకాదన్న సుజనా… పనులు ఆగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *