మహిళా డాక్టర్‌పై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం

ఓ బీజేపీ ఎమ్మెల్యే.. తనపై అత్యాచారం చేశాడని.. పోలీస్‌ కంప్లైయింట్ ఇచ్చింది ఓ డాక్టర్. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని బామెంగ్‌లో జరిగింది. బామెంగ్ ఎమ్మెల్యే గోరుక్ పొర్దంగ్ ఇటానగర్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు. అయితే… అతన్ని కలిసేందుకు హోటల్‌కు వెళ్లిన తనపై అత్యాచారం చేశాడని వివాహిత అయిన ఓ మహిళా డాక్టర్ ఇటానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. ఆమె కావాలని.. నాపై కుట్ర పన్నుతుందని… రాజకీయంగా.. నన్ను ఎదగనివ్వకుండా ప్లాన్ చేస్తున్నారని.. ఆమె […]

మహిళా డాక్టర్‌పై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 11:03 AM

ఓ బీజేపీ ఎమ్మెల్యే.. తనపై అత్యాచారం చేశాడని.. పోలీస్‌ కంప్లైయింట్ ఇచ్చింది ఓ డాక్టర్. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని బామెంగ్‌లో జరిగింది. బామెంగ్ ఎమ్మెల్యే గోరుక్ పొర్దంగ్ ఇటానగర్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు. అయితే… అతన్ని కలిసేందుకు హోటల్‌కు వెళ్లిన తనపై అత్యాచారం చేశాడని వివాహిత అయిన ఓ మహిళా డాక్టర్ ఇటానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే.. ఆమె కావాలని.. నాపై కుట్ర పన్నుతుందని… రాజకీయంగా.. నన్ను ఎదగనివ్వకుండా ప్లాన్ చేస్తున్నారని.. ఆమె ఇదివరకే నన్ను పలుమార్లు నన్ను కలిసిందని ఎమ్మెల్యే గోరుక్ అంటున్నారు. ఈ నెల 12వ తేదీన రాత్రి ఇటానగర్ హోటల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేయగా పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు. కాగా.. మహిళ ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవముందా..? లేదా..? అనేది ప్రాథమిక దర్యాప్తు చేసేందుకు సమయం తీసుకున్నామని.. అందుకే కేసు నమోదులో జాప్యం జరిగిందని ఎస్పీ తుమ్మీఅమో చెప్పారు. అయితే.. ఇప్పటికే ఉన్నావ్ అత్యాచార ఘటనలో ఓ బీజేపీ నేత ఇరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఇప్పుడు మరో బీజేపీ నేతపై అత్యాచారం కేసులో ఇరుక్కోవడం గమనార్హం. ఈ అత్యాచార ఆరోపణల్లో ఎంతమేర నిజం ఉందో తెలియాల్సి ఉంది.