ఉమ్మేసినందుకు బీజేపీ నేతకు ఫైన్‌.. ఏంత వేశారంటే..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఇక బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తే జరిమానాలు విధిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే జరిమానాలు వసూలు చేస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోని రాజ్‌కోట్‌లో.. ప్రతిపక్ష బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అరవింద్ రైయానీ కూడా దాదాపు ఇలాంటి పనే చేశారు. అయితే.. వెంటనే ఫెనాల్టీ కట్టేశారు. కమ్యూనిటీ కిచెన్ […]

ఉమ్మేసినందుకు బీజేపీ నేతకు ఫైన్‌.. ఏంత వేశారంటే..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 02, 2020 | 10:10 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఇక బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తే జరిమానాలు విధిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే జరిమానాలు వసూలు చేస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోని రాజ్‌కోట్‌లో.. ప్రతిపక్ష బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అరవింద్ రైయానీ కూడా దాదాపు ఇలాంటి పనే చేశారు. అయితే.. వెంటనే ఫెనాల్టీ కట్టేశారు. కమ్యూనిటీ కిచెన్ సెంటర్‌ ఆవరణలో.. మొఖానికి ఉన్న మాస్క్ తొలగించి.. ఉమ్మేశారు. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. వాస్తవానికి ఇది నా సొంత కమ్యూనిటీ సెంటర్‌ ఆవరణ అని. ఈ ఘటన కూడా ఈ ఆవరణలోనే జరిగిందన్నారు. తాను ప్రభుత్వ స్థలాల్లో కానీ.. రోడ్లపై కానీ.. ఇతర బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉమ్మేయలేదని.. అయినప్పటికీ తాను కమ్యూనిటీ సెంటర్లో ఉమ్మేయడం నా పొరపాటు అంటూ ఒప్పేసుకున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి జరిమానా కూడా చెల్లించానన్నారు.

కాగా.. కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేస్తే శిక్షార్హమని, జరిమానా వేస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.