బీజేపీ ఎమ్మెల్యే కండకావరం.. ప్రభుత్వాధికారిపై బ్యాట్‌తో దాడి

మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. మున్సిపల్ కార్పోరేషన్‌ ఆఫీసర్‌ను క్రికెట్ బ్యాట్‌తో చితకబాదాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌లో ఆక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీసర్లు డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వార్గియా ఆయనతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆకాశ్.. ఆ అధికారిని బ్యాట్‌తో కొట్టారు. అక్కడున్న వారు అడ్డుకున్నా ఆయన మాత్రం వదలకుండా చితకబాదారు.

అనంతరం ఆకాశ్ మాట్లాడుతూ.. ‘‘డ్రైవ్ పేరిట అక్కడున్న ప్రజలను ఆఫీసర్లు ఇబ్బంది పెట్టారు. ఓ ప్రజాప్రతినిధిగా అధికారులు, ప్రజల మధ్య సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత. ఆ అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతూ.. దాదాగిరి చేస్తున్నారు. దాంతో నాలోని ఆవేశం కట్టలు తెంచుకు వచ్చింది. అందుకే వారిని కొట్టాను. దీనిపై ముందు ఏం జరుగుతుందో చూద్దాం’’ అంటూ పేర్కొన్నాడు. కాగా ఈ సంఘటనలో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *