భైంసాలో హోరాహోరీగా బీజేపీకి వర్సెస్ ఎంఐఎం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. కారు జోరు ముందు ప్రత్యర్ధులు బేజారవుతున్నారు. ఇప్పటి వరకూ వెలువడుతోన్న రిజల్ట్స్ చూస్తుంటే అధికార పార్టీనే ఆధిక్యం కనబరుస్తోంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బైంసాలో మాత్రం కారు జోరుకు బ్రేకులు పడింది. పుర ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి అక్కడి పరిస్థితి భిన్నంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ బీజేపీ హవా కొనసాగుతోంది. అయితే కమలం పార్టీకి ఎంఐఎం గట్టి పోటీ నిస్తోంది. 8 స్థానాల్లో […]

భైంసాలో హోరాహోరీగా బీజేపీకి వర్సెస్ ఎంఐఎం!
Follow us

| Edited By:

Updated on: Jan 25, 2020 | 12:17 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. కారు జోరు ముందు ప్రత్యర్ధులు బేజారవుతున్నారు. ఇప్పటి వరకూ వెలువడుతోన్న రిజల్ట్స్ చూస్తుంటే అధికార పార్టీనే ఆధిక్యం కనబరుస్తోంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బైంసాలో మాత్రం కారు జోరుకు బ్రేకులు పడింది. పుర ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి అక్కడి పరిస్థితి భిన్నంగానే కనిపిస్తోంది.

ప్రస్తుతం అక్కడ బీజేపీ హవా కొనసాగుతోంది. అయితే కమలం పార్టీకి ఎంఐఎం గట్టి పోటీ నిస్తోంది. 8 స్థానాల్లో బీజేపీ సత్తా చాటితే.. ఏడు స్థానాల్లో ఎంఐఎం విజయఢంకా మోగించింది. ఈ ఒక్క స్థానంలో తప్ప మిగతా చోట్ల టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది.

ఇటీవల భైంసాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా దళాలు భారీగా మోహరించారు. సుమారు 1000 మందితో పోలీసులు బందోబస్తు మరింత పటిష్టం చేశారు. పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ర్యాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్, ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్, కర్ఫ్యూ ఎత్తివేసినా పట్టణంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.