Pro CAA: సీఏఏతో నష్టం లేదు.. కేసీఆర్‌ది అసత్యప్రచారం

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీలు. దేశంలోని ఏ ఒక్క ముస్లిం పౌరసత్వానికి ఎలాంటి నష్టం లేదని వారంటున్నారు. విదేశాల నుంచి వచ్చే ముస్లింలు ఇక్కడి ముస్లింల పొట్టకొడుతున్నారని,

Pro CAA: సీఏఏతో నష్టం లేదు.. కేసీఆర్‌ది అసత్యప్రచారం
Follow us

|

Updated on: Mar 17, 2020 | 1:32 PM

BJP leaders staged dharna in Delhi Telanganabhavan: సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీలు. దేశంలోని ఏ ఒక్క ముస్లిం పౌరసత్వానికి ఎలాంటి నష్టం లేదని వారంటున్నారు. విదేశాల నుంచి వచ్చే ముస్లింలు ఇక్కడి ముస్లింల పొట్టకొడుతున్నారని, వారి వల్ల భారతీయ ముస్లింలు అప్రతిష్ట పాలవుతున్నార్న విషయం గుర్తించాలని బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్, సోయం బాపూరావు టీఆర్ఎస్ నాయకత్వానికి సూచించారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా నియమితులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కలిసి న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మంగళవారం మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీలు మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యవహారం చూస్తే యావత్ తెలంగాణ తల దించుకుంటుందన్నారు. పూర్తి వాస్తవాలను తెలుసుకోకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా అర్ధం కావడం లేదని వారు వ్యాఖ్యానించారు.

దేశంలోని ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి నష్టం లేదని, వేరే దేశం నుంచి ముస్లింలు వస్తే ఈ దేశంలో ఉన్న ముస్లింల పొట్టకొట్టే ప్రయత్నం చేసినట్లేనని చెబుతున్న బీజేపీ ఎంపీలు.. సీఏఏ వ్యతిరేక తీర్మానం చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ అయినా, ఒవైసీ అయినా జాతీయ పౌర పట్టిక(NPR)లో నమోదు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే సీఎం కేసీఆర్, ఒవైసీ పాకిస్థాన్‌కు శరణార్ధులుగా వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. సీఏఏ, ఎన్పీఆర్‌ల అమలు జరిగి తీరుతుందంటున్న బీజేపీ ఎంపీలు.. తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానం చెత్తబుట్టకే పరిమితమవుతుందన్నారు.