పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ.. కూకట్‌పల్లి బిజెపి కార్యాలయం ధ్వంసం

జీ.హెచ్.యం.సి కార్పొరేషన్ ఎన్నికలలో కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బిజెపి‌ అభ్యర్థులకు కేటాయించే సీట్లను బిజెపి మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి అమ్ముకున్నారంటూ బిజెపి కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్ కూకట్‌పల్లి లోని బిజెపి కార్యాలయం ధ్వంసం చేశారు. ఇరవై సంవత్సరాలుగా పార్టీకి పని చేస్తున్న తమను కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఫతేనగర్, బాలానగర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి డివిజన్ల కార్యకర్తలు నాయకులు బిజెపి కార్యాలయం పై దాడి చేసారు. […]

  • Venkata Narayana
  • Publish Date - 2:20 pm, Fri, 20 November 20

జీ.హెచ్.యం.సి కార్పొరేషన్ ఎన్నికలలో కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బిజెపి‌ అభ్యర్థులకు కేటాయించే సీట్లను బిజెపి మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి అమ్ముకున్నారంటూ బిజెపి కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్ కూకట్‌పల్లి లోని బిజెపి కార్యాలయం ధ్వంసం చేశారు. ఇరవై సంవత్సరాలుగా పార్టీకి పని చేస్తున్న తమను కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఫతేనగర్, బాలానగర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి డివిజన్ల కార్యకర్తలు నాయకులు బిజెపి కార్యాలయం పై దాడి చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా పార్టీలోకి వచ్చిన హరీష్ రెడ్డి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగాఅయ్యాక, టికెట్లను అమ్ముకున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చెయ్యాలంటూ డిమాండ్ చేశారు. అంతకు ముందు వీరు బీజేపీ రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.