నాడు అసెంబ్లీలో పోర్న్ చూసిన ఎమ్మెల్యే.. నేడు కర్ణాటక డిప్యూటీ సీఎం !

కర్ణాటక సీఎం యెడియురప్ప మంగళవారం ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. (ఇటీవల 17 మందితో తన మంత్రివర్గాన్నిఆయన ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే). కొత్తగా డిప్యూటీ ముఖ్యమంత్రులుగా పదవులు చేపట్టినవారిలో లక్ష్మణ్ సావడి, గోవింద్ కరిజోలా, అశ్వత్థ నారాయణ ఉన్నారు. వీరిలో లక్ష్మణ్ సావడి గతంలో రాష్ట్ర అసెంబ్లీలో సెల్ ఫోన్‌లో పోర్న్ చూస్తూ వీడియోకు చిక్కారు. ఇలాంటి వ్యక్తిని డిప్యూటీ సీఎం చేయడాన్ని అప్పుడే.. బీజేపీ ఎమ్మెల్యేలే తప్పు పట్టడం ప్రారంభించారు. ఆయనను ఈ […]

నాడు అసెంబ్లీలో పోర్న్ చూసిన ఎమ్మెల్యే.. నేడు కర్ణాటక డిప్యూటీ సీఎం !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 22, 2021 | 4:41 PM

కర్ణాటక సీఎం యెడియురప్ప మంగళవారం ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. (ఇటీవల 17 మందితో తన మంత్రివర్గాన్నిఆయన ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే). కొత్తగా డిప్యూటీ ముఖ్యమంత్రులుగా పదవులు చేపట్టినవారిలో లక్ష్మణ్ సావడి, గోవింద్ కరిజోలా, అశ్వత్థ నారాయణ ఉన్నారు. వీరిలో లక్ష్మణ్ సావడి గతంలో రాష్ట్ర అసెంబ్లీలో సెల్ ఫోన్‌లో పోర్న్ చూస్తూ వీడియోకు చిక్కారు. ఇలాంటి వ్యక్తిని డిప్యూటీ సీఎం చేయడాన్ని అప్పుడే.. బీజేపీ ఎమ్మెల్యేలే తప్పు పట్టడం ప్రారంభించారు. ఆయనను ఈ పదవిలో ఎలా ఎంపిక చేశారని రేణుకాచార్య అనే ఎమ్మెల్యే ప్రశ్నించారు. పైగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సావడి ఓడిపోయారని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే తనను ఈ పదవికి ఎంపిక చేయడాన్ని లక్ష్మణ్ సావడి సమర్థించుకున్నారు. జాతీయ, రాష్ట్ర సీనియర్ నేతలు తనపట్ల విశ్వాసం చూపారని, తానేమీ ఈ పదవిని కోరలేదని ఆయన అన్నారు. సీనియర్ నాయకులే ఈ పోస్టును ఇచ్చినప్పుడు నేనెందుకు తిరస్కరించాలని ఆయన ప్రశ్నించారు. 2012 లో ఈయన, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు శాసన సభలో సెల్ లో అసభ్య దృశ్యాలు చూస్తూ వీడియోకు చిక్కారు. అప్పట్లో వీరి నిర్వాకంతో బీజేపీ ఇరకాటంలో పడింది. అయితే తాము రేవ్ పార్టీలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు సెల్ చూశామని, తమ తప్పేమీ లేదని సావడితో బాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ తరువాత తెలిపారు. మంగుళూరులో అప్పట్లో జరిగిన రేవ్ పార్టీలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్