లోకేష్‌కు అంతసీన్ లేదు: కన్నా లక్ష్మీనారాయణ

Bjp Leader Kanna Lakshminarayana Controversial Comments on TDP and YCP, లోకేష్‌కు అంతసీన్ లేదు: కన్నా లక్ష్మీనారాయణ

టీడీపీ నుంచి బీజేపీలోకి నాయకుల వలసలు మొదలయ్యాయని, ఏపీలో టీడీపీ కనుమరుగవుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని నడిపించే శక్తి సామర్ధ్యాలు చంద్రబాబుకు లేవని.. అతని కొడుకు లోకేష్‌కు అంతకన్నా లేదని అన్నారు. కాగా.. అలాగే వైసీపీ ప్రభుత్వంపై కూడా ఆయన స్పందించారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని.. వైఎస్ఆర్‌ పార్టీ రానురాను కుంటుపడుతుందని అన్నారు.

రాజన్న రాజ్యంలో ఏర్పాటు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను జగనన్న రాజ్యంలో నిర్మొహమాటం లేకుండా తొలగిస్తున్నారని.. ఇది తర్వాత జగన్‌కు ఇబ్బందిని కల్గిస్తుందని కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించిన ఆయన కార్యకర్తల సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *