చంద్రబాబుకు జీవీఎల్ సవాల్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు బహిరంగ సవాల్‌ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చేస్తోన్న కుల రాజకీయాలపై.. ఆ పార్టీపై వస్తోన్న అవినీతి ఆరోపణల నిర్థారణకు చంద్రబాబు సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. మీడియా సమావేశంలో జీవీఎల్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల చరిత్రలో గతంలో తానెన్నడూ కుల రాజకీయాలను చూడలేదని అన్నారు. దేశంలో ఇంతవరకూ ఎవరూ కూడా కులం విషయంలో బీజేపీ వైపు వేలెత్తి చూపలేదని స్పష్టం చేశారు. […]

చంద్రబాబుకు జీవీఎల్ సవాల్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 7:51 PM

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు బహిరంగ సవాల్‌ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చేస్తోన్న కుల రాజకీయాలపై.. ఆ పార్టీపై వస్తోన్న అవినీతి ఆరోపణల నిర్థారణకు చంద్రబాబు సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. మీడియా సమావేశంలో జీవీఎల్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల చరిత్రలో గతంలో తానెన్నడూ కుల రాజకీయాలను చూడలేదని అన్నారు. దేశంలో ఇంతవరకూ ఎవరూ కూడా కులం విషయంలో బీజేపీ వైపు వేలెత్తి చూపలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకొచ్చారు.

మోదీ ప్రభుత్వం రైతులకు ‘కిసాన్‌ సమ్మాన్‌’ నిధి కింద రెండు వేల రూపాయలు ఇస్తుండటంతో.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అనే స్టిక్కర్‌ కార్యక్రమానికి తెర తీశాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ, ఈడీ అంటే ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ జీవీఎల్‌ చేశారు. హైదరాబాదును ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు.. నాలుగేళ్లలో అమరావతిలో ఒక్క నిర్మాణాన్ని కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నలు సంధించారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు గ్రాఫిక్స్‌తో కాలం గడుపుతున్నారని ఆరోపించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?