కేటీఆర్‌‌పై బీజేపీ నేత ఫైర్!

BJP Leader Dattatreya condemns KCR comments, కేటీఆర్‌‌పై బీజేపీ నేత ఫైర్!

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కేసీఆర్ 15 ఆగస్టు జాతీయ జెండా ఎగురవేసినట్లుగానే సెప్టెంబర్ 17న కూడా జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. మజ్లిస్‌కు భయపడి తెరాస సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించడంలేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీకి వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నీళ్లులేక ఎండిపోతున్నాయన్నారు. ప్రాజెక్టుల కింద రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరందించని పరిస్థితి ఉందని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్‌ పార్టీలోనే ఏకాభిప్రాయంలేదన్నారు. చిదంబరం లాంటి వ్యక్తి ఆర్టికల్ 370రద్దును మతంతో ముడిపెట్టడం తగదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *