బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటీవల ఓ మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో చెలరేగిపోయిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ వర్గియాపై ఆపార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎమ్మెల్యే ఆకాశ్ క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వెంటనే విడుదలై బయటకు వచ్చారు. అయితే ఆకాశ్ బయటకు వచ్చిన సమయంలో బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కొంతమంది కార్యకర్తలు […]

బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2019 | 8:28 PM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటీవల ఓ మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో చెలరేగిపోయిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ వర్గియాపై ఆపార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎమ్మెల్యే ఆకాశ్ క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వెంటనే విడుదలై బయటకు వచ్చారు. అయితే ఆకాశ్ బయటకు వచ్చిన సమయంలో బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కొంతమంది కార్యకర్తలు సందడి చేశారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఎవరి కొడుకైనా సరే చర్యలు తీసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . పార్టీకి చెడ్డపేరు తెచ్చే వారెవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపధ్యంలోనే అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఆకాశ్ వర్గియాను పార్టీనుంచి సస్పెండ్ చేయకుండా కేవలం నోటీసులు జారీ చేయడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.