తిరుగు లేని బీజేపీ..

దేశంలో కేవలం హిందీ రాష్ట్రాల్లోనే బీజేపీ ప్రభంజనం ఉందనే ప్రచారం ఇక కనుమరుగు కానుంది. ఈ పార్టీ ఒక్కటే  ఈ రాష్ట్రాల్లో 225 సీట్లలో 190 సీట్లను (44 శాతం) గెలుచుకుందని రాహుల్ వర్మ, ప్రదీప్ బిబ్బర్ అనే విశ్లేషకులు పేర్కొన్నారు. హిందీయేతర రాష్ట్రాల్లో బీజేపీ 22 శాతం ఓట్లను దక్కించుకోగలిగిందని వారు తెలిపారు. కర్ణాటకలో 2014 ఎన్నికల్లో 17 సీట్లలో  గెలిచిన ఈ పార్టీ ఈ ఎన్నికల్లో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగింది. తెలంగాణాలోని 17 […]

తిరుగు లేని బీజేపీ..
Follow us

|

Updated on: May 23, 2019 | 7:19 PM

దేశంలో కేవలం హిందీ రాష్ట్రాల్లోనే బీజేపీ ప్రభంజనం ఉందనే ప్రచారం ఇక కనుమరుగు కానుంది. ఈ పార్టీ ఒక్కటే  ఈ రాష్ట్రాల్లో 225 సీట్లలో 190 సీట్లను (44 శాతం) గెలుచుకుందని రాహుల్ వర్మ, ప్రదీప్ బిబ్బర్ అనే విశ్లేషకులు పేర్కొన్నారు. హిందీయేతర రాష్ట్రాల్లో బీజేపీ 22 శాతం ఓట్లను దక్కించుకోగలిగిందని వారు తెలిపారు. కర్ణాటకలో 2014 ఎన్నికల్లో 17 సీట్లలో  గెలిచిన ఈ పార్టీ ఈ ఎన్నికల్లో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగింది. తెలంగాణాలోని 17 సీట్లలో 4 స్థానాల్లో విజయం సాధించి నిలదొక్కుకుంది. కాగా-ఏపీ, తమిళనాడులో ఈ పార్టీ హవా లేదు. కేరళలో 12 శాతం ఓట్లను బీజేపీ దక్కించుకుంది. ఏమైనా.. మోదీ, అమిత్ షా హవా.. ముందు కాంగ్రెస్ సహా..ఇతర విపక్షాలు బేర్ మన్నాయి.