సీమ సిగలో కమల వికాసం.. అమిత్ వ్యూహం ఇదేనా ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి నుంచి కూడా భారతీయ జనతాపార్టీ ఒక్క తెలంగాణలోనే కాస్తో కూస్తూ బలంగా కనిపించేది. లీడర్లతోపాటు క్యాడర్ కూడా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ సందడి చేసేంది. రాష్ట్రం విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ పార్టీ కునారిల్లిన పోయిన పరిస్థితిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగే అవకాశం కమలనాథులకు కనిపిస్తోంది. దానికి తోడు కేంద్రంలో బలమైన ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ, ఎవ్వరికీ లేనంత చరిష్మాను మూటగట్టుకున్ననరేంద్ర మోదీ లాంటి ధీటైన నేత వున్న బిజెపి.. […]

సీమ సిగలో కమల వికాసం.. అమిత్ వ్యూహం ఇదేనా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2019 | 4:10 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి నుంచి కూడా భారతీయ జనతాపార్టీ ఒక్క తెలంగాణలోనే కాస్తో కూస్తూ బలంగా కనిపించేది. లీడర్లతోపాటు క్యాడర్ కూడా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ సందడి చేసేంది. రాష్ట్రం విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ పార్టీ కునారిల్లిన పోయిన పరిస్థితిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగే అవకాశం కమలనాథులకు కనిపిస్తోంది. దానికి తోడు కేంద్రంలో బలమైన ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ, ఎవ్వరికీ లేనంత చరిష్మాను మూటగట్టుకున్ననరేంద్ర మోదీ లాంటి ధీటైన నేత వున్న బిజెపి.. సహజంగానే దేశంలో తమకు ప్రాబల్యం లేవు అనిపించిన ప్రాంతంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలన్న కమలవ్యూహం అక్కడా.. ఇక్కడా బాగానే అమలవుతోంది. అందులో భాగంగా ఏపీలో కమలాకర్ష్ జోరుగా కొనసాగుతోంది. అయితే రాయలసీమలో పార్టీ విస్తరణ అంత ఈజీ కాకపోవడంతో అమిత్ షా ప్రత్యేక వ్యూహం ప్రకారం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారి చేసినట్లు తెలుస్తోంది. ఒక వైపు కడప, ఇంకోవైపు కర్నూలు జిల్లాలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. తాజాగా కడప జిల్లాలోని జమ్మలమడుగులో టిడిపిని ఆల్ మోస్ట్ క్లీన్ బౌల్డ్ చేసేసింది కమల దళం.

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని బిజెపిలో చేర్చుకుంది. అదే దూకుడుతో మరికొందరికి పార్టీ వైపునకు లాగేందుకు బిజెపి నేతలు తెరచాటు మంత్రాంగం నడుపుతున్నారు. ఇటు కర్నూలు జిల్లాలోను ఇటీవల బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ సారథ్యంలో కమల వికాసం జోరందుకుంది. ఇటీవల ఆయన పలువురు టిడిపి లీడర్లకు కాషాయ తీర్థం ఇప్పించారు. మే నెలలో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార టిడిపి రాయలసీమలోని 51 నియోజకవర్గాలలో కేవలం మూడు.. మూడంటే మూడు సీట్లలో గెలుపొందింది. సో.. టిడిపి పతనం పూరిపూర్ణమైందని భావిస్తున్న బిజెపి నేతలు రాయలసీమలో వైసీపీకి ధీటుగా ఎదగాలని భావిస్తున్నారు. అందుకే గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, పలు మార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిని టార్గెట్ చేస్తున్నారు బిజెపి నేతలు.

ఇందులో భాగంగానే ఆదినారాయణ రెడ్డికి గాలమేసినట్లు సమాచారం. కేవలం బిజెపి నేతలే కాకుండా సంఘ్ పరివార్‌కు చెందిన ఆర్ఎస్ఎస్, ఏబివిపి, విహెచ్‌పీ నేతలందరూ రాయలసీమలో బిజెపి విస్తరణకు తమతమ మార్గాలలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీశైలం సందర్శంచి.. కర్నూలులో పొలిటికల్ దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. సో.. 2024 నాటికి బాగా వేళ్లూనుకోవాలన్న బిజెపి వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.