బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్..! ఉంటుందా మరి రిజల్ట్ ?

పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు హుందాగా ఎలా మెలగాలో, సభలోనే కాక, బయట కూడా మర్యాదగా ఎలా ప్రవర్తించాలో, తాము ఎంపీలమన్న ‘ దూకుడును ‘ ఎలా తగ్గించుకోవాలో వారికి శిక్షణనిచ్చేందుకు ఉద్దేశించిన రెండు రోజుల పార్టీ వర్క్ షాప్ ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డా ఆధ్వర్యంలో శనివారం ఈ వర్క్ షాప్ మొదలైంది. తమ […]

బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్..! ఉంటుందా మరి రిజల్ట్ ?
Follow us

|

Updated on: Aug 03, 2019 | 4:33 PM

పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు హుందాగా ఎలా మెలగాలో, సభలోనే కాక, బయట కూడా మర్యాదగా ఎలా ప్రవర్తించాలో, తాము ఎంపీలమన్న ‘ దూకుడును ‘ ఎలా తగ్గించుకోవాలో వారికి శిక్షణనిచ్చేందుకు ఉద్దేశించిన రెండు రోజుల పార్టీ వర్క్ షాప్ ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డా ఆధ్వర్యంలో శనివారం ఈ వర్క్ షాప్ మొదలైంది. తమ పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరు కావాలని ఈ శిక్షణ శిబిరంలో నేతలు పిలుపునిచ్చారు. మీడియాకు అనుమతి లేని ఈ ‘ బీజేపీ అభ్యాస వర్గ ‘ లో సభ్యుల ప్రవర్తన, క్రమశిక్షణ, పార్లమెంటరీ ప్రొసీజర్, సిధ్ధాంత పరమైన అంశాలపై ఎంపీలకు శిక్షణ ఇస్తున్నారు. మొదట నడ్డా ఇనాగురల్ స్పీచ్ ఇస్తూ.. పార్లమెంటుకు ఎంపీల రెగ్యులర్ అటెండ్స్ ఎంతయినా ముఖ్యమన్నారు. ఈ సాయంత్రం అమిత్ షా మరికొన్ని అంశాలపై ‘ బోధించనున్నారు ‘. బీజేపీ క్రమశిక్షణ తరగతుల పేరిట ఓ ఫోటో కాపీని మాత్రం నాయకులు మీడియాకు ఇవ్వడం విశేషం. అటు-మోదీ ఆదివారం ప్రసంగించనున్నారు. కొంతమంది ఎంపీలు అదేపనిగా నోరు పారేసుకుని పార్టీని ఇరకాటాన బెట్టడాన్ని, వివాదాలు సృష్టించడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. ‘ అభ్యాస వర్గ ‘ అన్న శిక్షణను హిమాచల్ ప్రదేశ్ తో బాటు కొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఎంపీలుగా ఎన్నికైనవారికి ఈ వర్క్ షాపులో తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అలాగే సీనియర్ నేతలు జూనియర్లకు తమ హక్కులు, బాద్యతలను ఎలా నిర్వర్తించాలో కూడా వివరించనున్నారు. ఈ విధమైన శిక్షణ తరగతులు రెగ్యులర్ గా జరుగుతాయని సీనియర్ ఎంపీ ఒకరు తెలిపారు. మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే హత్య చేయడంపై గాడ్సేని పొగుడుతూ మొదటిసారి ఎంపీ అయిన ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల కలకలం రేపాయి. పైగా బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆమె.. టాయిలెట్లను కడగడానికి తాము ఎంపీలం కాలేదని కామెంట్ చేసి మరో వివాదాన్ని సృష్టించారు. 2008 మాలెగావ్ బ్లాస్ట్ కేసులో నిందితురాలైన ఈమె.. యవ్వారంపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయింది.. ప్రజ్ఞా ఠాకూర్ ని పిలిపించి నేతలు గట్టిగా మందలించారు. ఇక ఇదే పార్టీకి చెందిన రామ్ శంకర్ కథేరియా.. గార్డులు ఆగ్రా సమీపంలో టోల్ ప్లాజా ఉద్యోగులైన కొందరిని చితకబాదిన ఉదంతం తాలూకు వీడియో పార్టీకి తలనొప్పిని తెచ్చింది. ఈ సీసీటీవీ ఫుటేజీలు చూసి నేతలు ఆశ్చర్యపోయారు. అలాగే ఉన్నావ్ రేప్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ని చూసేందుకు పార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ జైలుకు వెళ్లడాన్ని కూడా పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఇతడిని (సెంగార్ ని)పార్టీనుంచి బహిష్కరించారు. ఉత్తరాఖండ్ కు చెందిన పార్టీనేత కున్వర్ ప్రణవ్ సింగ్ తన బర్త్ డే రోజున తుపాకులు చూపుతూ సెలబ్రిటీ చేసుకుని ఆ వీడియోను వైరల్ చేశాడు. అది కూడా కమలనాథుల కంట బడింది. మధ్యప్రదేశ్ లో ఇండోర్ మాజీ ఎమ్మెల్యే ఆకాష్ విజయ్ వర్గీయ.. ఓ మున్సిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టిన వైనం కూడా ఇలాంటిదే..ముఖ్యంగా ప్రధాని మోదీ సంబంధిత వీడియో చూసి ఆగ్రహం పట్టలేకపోయారు. ఫలితంగా ఆకాష్ ను పార్టీనుంచి వెంటనే సస్పెండ్ చేశారు. ఇక-పార్లమెంటుకు హేమమాలిని, సన్నీ డియోల్ వంటి సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు డుమ్మా కొడుతున్న వైనాన్ని కూడా బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకే పార్టీ ఈ విధమైన వర్క్ షాప్ నిర్వహణకు పూనుకొంది. మరి.. దీనివల్ల ప్రయోజనం ఉంటుందా అన్నది కాలమే తేల్చాలి.

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!