బీజేపీ గడపలో రాజగోపాలుడు.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?

బీజేపీ తీర్థం పుచ్చుకోవాలనుకుంటోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇంకా ఆ పార్టీ తలుపులు తెరవలేదు. ప్రస్తుతం కోమటిరెడ్డి ఢిల్లీలో ఉండగా.. బీజేపీలోకి ఆయన చేరికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రస్తుతమున్నపరిస్థితుల్లో తొందరపడి కాంగ్రెస్‌కు రాజీనామా చేయొద్దని కోమటిరెడ్డికి బీజేపీ హైకమాండ్ సూచించనట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ నుంచి సానుకూల స్పందన వచ్చిన తరువాత బీజేపీలో ఆయన చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఎప్పటినుంచో కాంగ్రెస్‌లో కొనసాగుతోన్న కోమటిరెడ్డి తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే […]

బీజేపీ గడపలో రాజగోపాలుడు.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 08, 2019 | 7:43 PM

బీజేపీ తీర్థం పుచ్చుకోవాలనుకుంటోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇంకా ఆ పార్టీ తలుపులు తెరవలేదు. ప్రస్తుతం కోమటిరెడ్డి ఢిల్లీలో ఉండగా.. బీజేపీలోకి ఆయన చేరికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రస్తుతమున్నపరిస్థితుల్లో తొందరపడి కాంగ్రెస్‌కు రాజీనామా చేయొద్దని కోమటిరెడ్డికి బీజేపీ హైకమాండ్ సూచించనట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ నుంచి సానుకూల స్పందన వచ్చిన తరువాత బీజేపీలో ఆయన చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఎప్పటినుంచో కాంగ్రెస్‌లో కొనసాగుతోన్న కోమటిరెడ్డి తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ పార్టీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.