ఎమ్మెల్సీ కవిత ఓటుపై బీజేపీ రాద్ధాంతం..ఈసీకి బండి సంజయ్ లేఖ.. నిబంధనల ప్రకారమే బదిలీ అంటున్న ఆర్డీఓ

ఎమ్మెల్సీ కవిత కొత్త వివాదంలో చిక్కుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్లో కవితకు ఓటు హక్కు ఉందని ఫిర్యాదులో పేర్కాన్నారు...

ఎమ్మెల్సీ కవిత ఓటుపై బీజేపీ రాద్ధాంతం..ఈసీకి బండి సంజయ్ లేఖ.. నిబంధనల ప్రకారమే బదిలీ అంటున్న ఆర్డీఓ
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Dec 02, 2020 | 4:56 PM

Mlc Kavitha Second Vote : కేంద్ర ఎన్నికల సంఘానికి   భారతీయ జనత పార్టీ ఫీర్యాదు చేస్తు లేఖ రాసింది. ఎమ్మెల్సీ కవితను డిస్‌ క్వాలిఫై చేయాలని ఈ లేఖలో పేర్కొంది. రెండు చోట్ల ఓటు వేసినందుకు ఆమెను అనర్హురాలిగా గుర్తించి చర్యలు తీసుకోవాలని బీజేపీ కోరింది. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో భోదన్‌లో ఓటు వేయడంతో పాటు నిన్న జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఓటు వేసిన విషయాన్ని బీజేపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్దేశ పూర్వకంగానే ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కును ఉయోగించుకున్నారని లేఖలో బీజేపీ పేర్కొంది .

ఎమ్మెల్సీ క‌విత ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డంపై త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదు కానీ… పోతంగ‌ల్‌లో ఉన్న ఓటు అలాగే ఉండ‌గా ఇక్క‌డ ఎలా రెండో ఓటు వేశార‌ని బీజేపీ ప్ర‌శ్నించింది. రాజ్యాంగాన్ని దుర్వినియోగ ప‌రుస్తూ… దొంగ ఓటు వేసిన క‌విత‌కు ఎమ్మెల్సీగా కొన‌సాగే నైతిక హ‌క్కు లేద‌ంటు వారు లేఖలో పేర్కొన్నారు. ఈ వ్య‌వ‌హారంపై ఎన్నిక‌ల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశామని ఇందిరా శోభన్ అన్నారు.

ఇదిలా వుండగా.. ఎమ్మెల్సీ కవిత ఓటును నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్ గ్రామం నుంచి హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గానికి బదిలీ చేసినట్లు బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ తెలిపారు. కవిత చేసుకున్న దరఖాస్తు మేరకు ఆమె ఓటును బదిలీ చేశామని తెలిపారు.