#COVID19 ప్రత్యేక బులెటిన్ ఎందుకివ్వరు? కేసీఆర్‌కు బీజేపీ సూటి ప్రశ్న

కోవిడ్ వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలందరూ భయాందోళన చెందుతున్న తరుణంలో ఎప్పటికప్పుడు వైరస్ వ్యాప్తిపై తాజా సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సి వుందంటోంది తెలంగాణ బీజేపీ. సోషల్ మీడియా విపరీతంగా జన బాహుళ్యంలో చొచ్చుకుపోయిన నేపథ్యంలో...

#COVID19 ప్రత్యేక బులెటిన్ ఎందుకివ్వరు? కేసీఆర్‌కు బీజేపీ సూటి ప్రశ్న
Follow us

|

Updated on: Mar 28, 2020 | 7:13 PM

BJP demands daily health bulletin on Covid-19: కోవిడ్ వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలందరూ భయాందోళన చెందుతున్న తరుణంలో ఎప్పటికప్పుడు వైరస్ వ్యాప్తిపై తాజా సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సి వుందంటోంది తెలంగాణ బీజేపీ. సోషల్ మీడియా విపరీతంగా జన బాహుళ్యంలో చొచ్చుకుపోయిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై విపరీత సంఖ్యలో వదంతులు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళుతున్న తరుణంలో ప్రభుత్వం ప్రతి రోజు ఒకటి, రెండు సార్లు వైరస్ వ్యాప్తిపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేయడం ఉపయుక్తంగా వుంటుందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కరోనాపై హెల్త్ బులిటెన్ ఇవ్వకపోవడంపై కృష్ణ సాగర్ రావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘ప్రతీరోజూ ఎందరికి వ్యాధి సోకింది వంటి వివరాలతో బులిటెన్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వడం లేదు.. ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇవ్వకపోతే, దానివల్ల కొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారు… తద్వారా ప్రజల్లో అయోమయం నెలకొంటుంది…’’అని కృష్ణ సాగర్ రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ రోజూవారీ హెల్త్ బులిటెన్లు ఇవ్వడం ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో వలస కుటుంబాలను ఆదుకోవాలన్న కేంద్రం ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని కృష్ణ సాగర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.