వాట్సాప్ ఆంక్షలా..? నెవర్ మైండ్ !

ఇండియాలో ఎన్నికల కోలాహలం ముగింపు దశకు చేరుకోనుంది. ఈ నెల 19 తో ఈ ‘ సంరంభం ‘ ముగుస్తోంది. ఈ సీజన్ లో వాట్సాప్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, రాజకీయ విద్వేష ప్రచారాన్ని అడ్డుకోవడానికి, తప్పుడు ప్రచారాలకు కళ్ళెం వేయడానికి ‘ పాపం ‘ వాట్సాప్ కొన్ని ఆంక్షలు విధించింది. ముఖ్యంగా యూజర్లు కేవలం అయిదుగురికి మాత్రమే సందేశాలను పంపాలన్నది వీటిలో ఒకటి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుందని భావించింది. కానీ…  తానొకటి తలిస్తే..అన్నట్టు దీనికి విరుగుడుగా […]

వాట్సాప్ ఆంక్షలా..? నెవర్ మైండ్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 16, 2019 | 5:10 PM

ఇండియాలో ఎన్నికల కోలాహలం ముగింపు దశకు చేరుకోనుంది. ఈ నెల 19 తో ఈ ‘ సంరంభం ‘ ముగుస్తోంది. ఈ సీజన్ లో వాట్సాప్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, రాజకీయ విద్వేష ప్రచారాన్ని అడ్డుకోవడానికి, తప్పుడు ప్రచారాలకు కళ్ళెం వేయడానికి ‘ పాపం ‘ వాట్సాప్ కొన్ని ఆంక్షలు విధించింది. ముఖ్యంగా యూజర్లు కేవలం అయిదుగురికి మాత్రమే సందేశాలను పంపాలన్నది వీటిలో ఒకటి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుందని భావించింది. కానీ…  తానొకటి తలిస్తే..అన్నట్టు దీనికి విరుగుడుగా కేవలం వెయ్యి రూపాయలకు లభించే సాఫ్ట్ వేర్ టూల్..మార్కెట్లను ముంచెత్తుతోంది. డిజిటల్ మార్కెట్లలో రాజకీయ నేతలు, పార్టీల కార్యకర్తలు ఈ టూల్ కోసం ఎగబడుతున్నారు.ఈ సరికొత్త టూల్ ఉంటే చాలు.. యూజర్లు..అయిదుగురికి కాదు.. వేలాదిమందికి ఒకేసారి మెసేజులను పంపవచ్చు. ఇదే అదననుకుని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు దీనికోసం తహతహలాడుతున్నారు. ఢిల్లీలో రోహితాష్ అనే వ్యాపారి ఈ టూల్ ని అమ్ముతూ బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ మధ్యే ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు దీన్ని అమ్మానని బాహాటంగానే ఈయన చెబుతున్నాడు. తన అంచనా ప్రకారం.. ఇటీవలి నెలల్లో కేవలం ఒక్క టూల్.. లక్ష వాట్సాప్ సందేశాలను పంపగలిగిందట. తన రెండు గదుల ఇంటి నుంచే ఈయన ఈ దందా నడుపుతున్నాడు. బీజేపీతో బాటు అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆన్ లైన్ లో లభించే ఫ్రీ క్లోన్ యాప్స్ ను యధేచ్చగా వాడుతూ..తెరవెనుక ప్రచారాలు చేస్తున్నట్టు వెల్లడైంది. వాట్సాప్ ఇలా దుర్వినియోగమవుతోందన్న విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ గమనించింది. ఇండియాలోని అమెజాన్ డాట్ కామ్ లో కనీసం మూడు సాఫ్ట్ వేర్ టూల్స్ లభ్యమవుతున్నాయట. ఈ వార్తా సంస్థ జర్నలిస్టు ఒకరు వీటిని కొనుగోలు చేసినప్పుడు.. ఎలాంటి కంపెనీ బ్రాండ్ పేరు గానీ లేకుండా కార్డు బోర్డు బాక్సుల్లో కాంపాక్ట్ డిస్క్ లుగా ఇవి ‘ దర్శనమిచ్చాయి ‘. అయితే ఈ యవ్వారంపై స్పందించడానికి వాట్సాప్ ప్రతినిధి ఒకరు నిరాకరించారు. ఎవరైనా ఇలాంటి అనుచిత చర్యలకు పాల్పడితే లీగల్ చర్య తీసుకుంటామని మాత్రం ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో ఓ డిజిటల్ మార్కెటీర్..ఒక నెల సర్వీసుకు గాను లక్షన్నర రూపాయలు చార్జి చేస్తున్నాడంటే ఇది ఎంత స్థాయికి చేరుకుందో అర్థమవుతోందని అంటున్నారు. ఇతని దందా కారణంగా సుమారు మూడు లక్షల వాట్సాప్ సందేశాలు  వెళ్లిపోయాయని తెలిసింది.
‘ బిజినెస్ సెండర్ ‘ అనే సాఫ్ట్ వేర్ టూల్ అమ్మకాలవల్ల  ఇతనికి బాగానే సొమ్ములు ముడుతున్నాయి. మొత్తానికి వాట్సాప్ రెస్ట్రిక్షన్స్ జస్ట్ మొక్కుబడిగా..వార్తల్లో చదువుకోవడానికే పనికొస్తున్నాయన్న మాట !

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!