హుజుర్‌నగర్ బైపోల్ : టీఆర్‌ఎస్ ప్రధాన సమస్య అదేనా..?

హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలతో పాటు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు బరిలో దిగారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే కనిపిస్తోంది. అధికార పక్షమైన టీఆర్ఎస్.. రాష్ట్రంలో అంతో ఇంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ మధ్యే టఫ్ ఫైట్ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఏది కనిపించినా, మరేదో వినిపించినా హుజుర్ నగర్ మాత్రం మాదే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక హుజుర్ నగర్‌లో సీఎం […]

హుజుర్‌నగర్ బైపోల్ : టీఆర్‌ఎస్ ప్రధాన సమస్య అదేనా..?
Follow us

|

Updated on: Oct 18, 2019 | 6:43 AM

హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలతో పాటు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు బరిలో దిగారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే కనిపిస్తోంది. అధికార పక్షమైన టీఆర్ఎస్.. రాష్ట్రంలో అంతో ఇంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ మధ్యే టఫ్ ఫైట్ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఏది కనిపించినా, మరేదో వినిపించినా హుజుర్ నగర్ మాత్రం మాదే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక హుజుర్ నగర్‌లో సీఎం కేసీఆర్ సభ రద్దు కావడం హస్తం గూటిలో మరింత జోష్ కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ఇవన్నీ పక్కనబెడితే..అక్కడ లోపాయికారీ ఒప్పందాలు జరుగుతాయన్న చర్చ పార్టీ ఇన్నర్ వర్గాల్లో వినిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల సమయంలో.. తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు లోపాయి కారీగా సహకరించుకున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి వాదిస్తూ ఉంటుంది. ఇక నిజామాబాద్  పార్లమెంట్ స్థానంలో.. బీజేపీ విజయానికి కాంగ్రెస్ పార్టీ సహకారమే కీలకమని టీఆర్ఎస్ నేతలు అప్పట్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఎంత రంజుగా మారిందో తెలిసిందే. ఈ టైంలో టీఆర్‌ఎస్‌ను మానసికంగా దెబ్బతీయాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయా అన్న వార్తలు పొలిటికల్‌ సర్కిల్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు అందర్నీ లాక్కున్నారని కాంగ్రెస్ పగతో రగిలిపోతుంది..మరోవైపు బీజేపీ అధికార పక్షంపై ఒంటికాలుపై నిలబడుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హుజూర్ నగర్ లో ఇన్‌సైడ్ సహకారాలుంటాయా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.

హుజూర్ నగరర్ లో సాగుతున్న ఉప ఎన్నికలో ఇప్పుడు పోటీ రెండు పార్టీల మధ్యనే మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూడా నామినేషన్లు వేసినా.. ప్రచారంలోనే అవి వెనుకబడిపోయాయి. జనాలు కూడా కాంగ్రెస్,టీఆర్ఎస్ ల మధ్యనే ఎవరో ఒకరు అన్నట్టుగా ఉన్నారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికార పార్టీ కాస్త నెగిటివిటీని ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నిక మరో రెండు రోజుల్లో జరగనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ..పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎలా మారతాయో..!