హోం మంత్రి అమిత్‌ షాకు సర్జరీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సర్జరీ జరిగింది. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇందులో భాగంగా ఆయన మెడ వెనుక ఉన్న చిన్నగడ్డను మైనర్ సర్జీరీ చేసి తొలగించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సర్జరీ అనంతరం ఆయనను వైద్యులు డిశ్చార్జీ చేయడంతో బుధవారం మధ్యాహ్నం 12.30కు గాంధీనగర్ హైవేలో గల తన నివాసానికి వెళ్లిపోయారు. ఆయన వ్యక్తిగత పనుల […]

హోం మంత్రి అమిత్‌ షాకు  సర్జరీ
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 6:31 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సర్జరీ జరిగింది. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇందులో భాగంగా ఆయన మెడ వెనుక ఉన్న చిన్నగడ్డను మైనర్ సర్జీరీ చేసి తొలగించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సర్జరీ అనంతరం ఆయనను వైద్యులు డిశ్చార్జీ చేయడంతో బుధవారం మధ్యాహ్నం 12.30కు గాంధీనగర్ హైవేలో గల తన నివాసానికి వెళ్లిపోయారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం మంగళవారం గుజరాత్‌కు వచ్చారు అమిత్‌షా. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.