నగరంలో దేశ వ్యతిరేక శక్తులు.. డీజీపీకి బీజేపీ ఫిర్యాదు

దేశ వ్యతిరేక శక్తులు హైదరాబాద్‌లో ఉన్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ పత్రాలతో ఆధార్‌కార్డులు పొందిన రోహింగ్యాలపై దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఫేక్ డాక్యుమెంట్లతో రోహింగ్యాలు ఓటర్ కార్డులతో పాటుగా.. ఆధార్ కార్డులను పొందారని.. అలా ఆధార్ కార్డులను పొందిన 127 మందిపై వెంటనే దర్యాప్తు జరపాలని కోరారు. అంతేకాదు.. రోహింగ్యాలకు సంబంధించిన డేటాను కూడా డీజీపీకి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధ్యక్షుడు […]

నగరంలో దేశ వ్యతిరేక శక్తులు.. డీజీపీకి బీజేపీ ఫిర్యాదు
Follow us

| Edited By:

Updated on: Feb 25, 2020 | 4:26 AM

దేశ వ్యతిరేక శక్తులు హైదరాబాద్‌లో ఉన్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ పత్రాలతో ఆధార్‌కార్డులు పొందిన రోహింగ్యాలపై దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఫేక్ డాక్యుమెంట్లతో రోహింగ్యాలు ఓటర్ కార్డులతో పాటుగా.. ఆధార్ కార్డులను పొందారని.. అలా ఆధార్ కార్డులను పొందిన 127 మందిపై వెంటనే దర్యాప్తు జరపాలని కోరారు. అంతేకాదు.. రోహింగ్యాలకు సంబంధించిన డేటాను కూడా డీజీపీకి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్… ఎంఐఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ద్రోహానికి పాల్పడుతున్న రోహింగ్యాలకు ఎంఐఎం మద్దతు ఇవ్వడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. సీఏఏకు మద్దతుగా మార్చి 15న నిర్వహించే అమిత్‌ షా సభకు ప్రజలు భారీగా హాజరై.. అసదుద్దీన్‌ ఒవైసీకి బుద్ధి చెప్పాలన్నారు. దేశ హితం కోసమే ప్రధాని మోదీ – CAA, NRP తీసుకొస్తున్నారని లక్ష్మణ్‌ తెలిపారు.