గాంధీ పోరాటంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ.. అధిష్టానం ఏం చేసిందంటే..

మహాత్మా గాంధీపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఓ బహిరంగ సభలో.. మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ సారథ్యంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటమంతా.. ఓ డ్రామా అంటూ వర్ణించారు. హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. చరిత్ర చదువుతుంటే తన రక్తం మరిగిపోతోందని.. అసలు గాంధీని మహాత్మా, జాతిపిత అని పిలవడం మన దౌర్భాగ్యమంటూ మండిపడ్డారు. స్వాతంత్య్రోద్యమం […]

గాంధీ పోరాటంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ.. అధిష్టానం ఏం చేసిందంటే..
Follow us

| Edited By:

Updated on: Feb 04, 2020 | 6:07 AM

మహాత్మా గాంధీపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఓ బహిరంగ సభలో.. మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ సారథ్యంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటమంతా.. ఓ డ్రామా అంటూ వర్ణించారు. హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. చరిత్ర చదువుతుంటే తన రక్తం మరిగిపోతోందని.. అసలు గాంధీని మహాత్మా, జాతిపిత అని పిలవడం మన దౌర్భాగ్యమంటూ మండిపడ్డారు. స్వాతంత్య్రోద్యమం అంతా బ్రిటీష్ వారి కనుసన్నల్లోనే జరిగిందని… మరో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అనంత్ కుమార్ హెగ్డే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం సీరియస్ తీసుకుంది. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది.

కాగా, మహాత్మా గాంధీపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా పలువురు మహాత్ముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా అధిష్టానం వారిని మందలించి వదిలేసింది. మరి అధిష్టానం ఆదేశాలతో హెగ్డే క్షమాపణలు చెప్తారా.. లేదా అన్నది చూడాలి మరి.