ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నేతలు .. డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికిపోయిన నాయకులు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాలు నిన్నటివరకు హోరాహోరీగా సాగాయి. నేతలంతా మతాల తూటాలు పేల్చారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ  ప్రచారాలను వేడెక్కించారు....

  • Rajeev Rayala
  • Publish Date - 10:25 am, Mon, 30 November 20
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నేతలు .. డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికిపోయిన నాయకులు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాలు నిన్నటివరకు హోరాహోరీగా సాగాయి. నేతలంతా మతాల తూటాలు పేల్చారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ  ప్రచారాలను వేడెక్కించారు. చివరిరోజు  అమిత్ షా ప్రచారం చేయడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. ఈ క్రమంలో కొంతమంది బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. హయత్‌నగర్‌ డివిజన్‌లోని డివిజన్‌లోని బంజారకాలనీలో అర్ధరాత్రి సమయంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ బీజేపీ సీనియర్‌ నేతలు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్దనుంచి రూ.50 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా సరూర్‌నగర్‌ డివిజన్‌ బీజేపీ అభ్యర్థి బీజేపీ నేతలతో కలిసి సరూర్‌నగర్‌ డివిజన్‌ అంబేద్కర్‌నగర్‌లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఓట్లరు డబ్బులు పంచుతుండగా, విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడకు చేరుకొని బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొన్నారు. పోలీసులు రావడం గమనించిన బీజేపీ నాయకులు అక్కడినుంచి జారుకున్నారు.