Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

టీ.బీజేపీలో ఎట్టకేలకు కదలిక.. యాక్షన్ ప్లాన్ రెడీ

telangana bjp action plan, టీ.బీజేపీలో ఎట్టకేలకు కదలిక.. యాక్షన్ ప్లాన్ రెడీ

సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్టుపై దేశవ్యాప్తంగా ఆందోళనపర్వం రగులుకున్న పది రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు నిద్ర లేచారు. పౌరసత్వ సవరణ చట్టంపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు వివరించేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. తొలుత బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్‌ వేదికగా సీఏఏపై సభ నిర్వహించాలని తలపెట్టగా తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో ఆయన తన సభను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డా.కే.లక్ష్మణ్ పార్టీ సీనియర్లతో శనివారం భేటీ అయ్యారు. యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు.

సిఏఏపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో లక్ష్మణ్‌తోపాటు ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి , మాజీ మంత్రి డీకే అరుణ, పెద్దిరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్ 30న హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో సీఏఏ అనుకూల ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు.

జనవరి 2, 3, 4 తేదీలలో జిల్లాల వారీగా వర్క్ షాప్‌ల నిర్వహించాలని, జనవరి 5, 6, 7 తేదీలలో మునిసిపాలిటీల వారీగా విద్యావేత్తల సదస్సులు, ర్యాలీలు జరపాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. జనవరి 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇంటింటికి ప్రచారం చేయాలని, ప్రతి గ్రామంలో పతంగులు ఎగరేయాలని తలపెట్టారు. ప్రతి కార్యకర్త ఇంటిముందు ముగ్గులు వేయించడంతోపాటు సిఏఏకు సంఘీభావంగా ముగ్గుల పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు కమలం నేతలు. సీఏఏపై సభ నిర్వహించి, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై ఆరోపణలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై కమలం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Related Tags