23న ఏపీకి రానున్న కొత్త గవర్నర్

ఏపీకి కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 23వ తేదీన ఏపీకి రానున్నారు. మొదట తిరుమలకు వెళ్లనున్న ఆయన అక్కడ కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం 3.49గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి గన్నవరం రానున్న ఆయన.. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఆ తరువాత గన్నవరం విమానశ్రయం నుంచి ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. అనంతరం ఈ నెల 24న బుధవారం ఉదయం 11.30గంటలకు రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *