దేవుడు గొప్ప అన్న ఆ పాస్టర్‌ “కరోనా”తో మృతి..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా వ్యాపిస్తుందో తెలిసిందే. ఇప్పటికే రెండు మిలియన్ల మంది ఈ వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. మరో లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌కు కులం, మతం, రంగు, దేశం, ప్రాంతం అంటూ తేడా ఏం లేదు. దీనికి అందరూ ఒక్కటే. అందర్నీ సమానంగా చూస్తోంది ఈ మహమ్మారి. అయితే న్యూయార్క్‌లోని ఓ పాస్టర్‌ కరోనా మహమ్మారి గురించి వ్యాఖ్యలు చేసి.. చివరకు ఆ వైరస్‌ సోకి ప్రాణాలు […]

దేవుడు గొప్ప అన్న ఆ పాస్టర్‌ కరోనాతో మృతి..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 17, 2020 | 5:37 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా వ్యాపిస్తుందో తెలిసిందే. ఇప్పటికే రెండు మిలియన్ల మంది ఈ వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. మరో లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌కు కులం, మతం, రంగు, దేశం, ప్రాంతం అంటూ తేడా ఏం లేదు. దీనికి అందరూ ఒక్కటే. అందర్నీ సమానంగా చూస్తోంది ఈ మహమ్మారి. అయితే న్యూయార్క్‌లోని ఓ పాస్టర్‌ కరోనా మహమ్మారి గురించి వ్యాఖ్యలు చేసి.. చివరకు ఆ వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని వర్జీనియాలోని న్యూ డెలివరెన్స్‌ ఇవాలజలికల్ చర్చ్.. వ్యవస్థాపకుడైన బిషప్ గెరాల్ట్‌ గ్లెన్‌.. ఇటీవల కరోనా సోకడంతో మరణించాడు.

గత నెల మార్చి 22న ఈ పాస్టర్ చర్చ్‌లో సామూహిక ప్రార్ధనలు నిర్వహించాడు. ఆ ప్రార్ధనల్లో కరోనాను చూసి ఎవరూ భయపడొద్దని.. దేవుడి కంటే కరోనా గొప్పేం కాదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వైరస్‌ కంటే కూడా దేవుడే గొప్ప అని నమ్ముతానంటూ చర్చ్‌కు వచ్చిన వారి ముందు ప్రసగించాడు. అయితే ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఏప్రిల్ 4న ఆ పాస్టర్‌తో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన కూతురు వెల్లడించింది. ఆ తర్వాత ఇద్దర్నీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే తాజాగా.. ఆ పాస్టర్ చికిత్స పొందుతూ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. పాస్టర్ గ్లెన్‌ మరణించిన నేపథ్యంలో.. ఆయన చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను చర్చ్‌ యూట్యూబ్‌ చానల్‌ నుంచి తొలగించింది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..