బిస్కెట్ల స్ధానంలో వాల్‌నట్స్..కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం

ఇకపై ప్రభుత్వ కేంటిన్లలో బిస్కెట్లు కనిపించవు. అధికారుల సమావేశాల్లో స్నాక్స్ రూపంలో బిస్కెట్లను ఇవ్వరు. దీనికి కారణం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వాటిస్ధానంలో శరీరానికి బలాన్నిచ్చే కొన్ని వస్తువుల్ని ఇవ్వనున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్త నిబంధనలు విధించింది. ప్రభుత్వ కేంటీన్లలో దర్శనిమిచ్చే బిస్కెట్ల స్ధానంలో బఠాణీలు, వేరుశనగలు, ఖర్జూరం, వాల్‌నట్స్,బాదం, జీడిపప్పు వంటి బలవర్ధకమైన పదార్ధాలను ఉంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఆదేశాలు జారీచేశారు.  బిస్కెట్లలో ఉండే మైదా ఆరోగ్యానికి […]

బిస్కెట్ల స్ధానంలో వాల్‌నట్స్..కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 6:48 PM

ఇకపై ప్రభుత్వ కేంటిన్లలో బిస్కెట్లు కనిపించవు. అధికారుల సమావేశాల్లో స్నాక్స్ రూపంలో బిస్కెట్లను ఇవ్వరు. దీనికి కారణం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వాటిస్ధానంలో శరీరానికి బలాన్నిచ్చే కొన్ని వస్తువుల్ని ఇవ్వనున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్త నిబంధనలు విధించింది.

ప్రభుత్వ కేంటీన్లలో దర్శనిమిచ్చే బిస్కెట్ల స్ధానంలో బఠాణీలు, వేరుశనగలు, ఖర్జూరం, వాల్‌నట్స్,బాదం, జీడిపప్పు వంటి బలవర్ధకమైన పదార్ధాలను ఉంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఆదేశాలు జారీచేశారు.  బిస్కెట్లలో ఉండే మైదా ఆరోగ్యానికి హాని చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యానికి హాని చేసే వాటిని అందుబాటులో లేకుండా చేసి మేలు చేసే వాటిని ఉంచాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.