కేటీఆర్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. విషెస్‌ చెప్పిన సీఎం జ‌గ‌న్‌..

పుట్టినరోజు అనేది ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైనది. అందులోనూ తనువు, మనసు, ఆత్మంతా తెలంగాణే నిండిన మంత్రి కేటీఆర్ బర్త్ డే అంటే యావత్ తెలంగాణ అంతా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ రోజు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు పుట్టిన రోజు. దీంతో ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా..

కేటీఆర్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. విషెస్‌ చెప్పిన సీఎం జ‌గ‌న్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 12:30 PM

#HBDKTR పుట్టినరోజు అనేది ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైనది. అందులోనూ తనువు, మనసు, ఆత్మంతా తెలంగాణే నిండిన మంత్రి కేటీఆర్ బర్త్ డే అంటే యావత్ తెలంగాణ అంతా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ రోజు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు పుట్టిన రోజు. దీంతో ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రి హ‌రీష్ రావు, ఎంపీ జోగినప‌ల్లి సంతోష్ ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పాటు రాజ‌కీయ‌, సినీ, క్రీడా, అభిమానులు కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో పాటు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు కూడా బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ కూడా మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా గాడ్ బ్లెస్ యూ అంటూ ట్వీట్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు సీఎం జ‌గ‌న్.