బర్త్‌డే రోజే మైనర్ బాలిక మిస్టరీ డెత్.. కారణమెవరు..?

పుట్టిన రోజు నాడే శవమై తేలింది ఓ మైనర్ బాలిక. పుట్టిన రోజు వేడుకల కోసమని స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఆ బాలిక.. జన సంచారం లేని ప్రదేశంలో విగత జీవిగా పడిపోయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన ఓ మిస్టరీ డెత్ ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక హత్యకు గురైంది. హంటర్‌ రోడ్‌లో బాలిక మృతదేహాన్ని పడేశారు గుర్తు తెలియని […]

బర్త్‌డే రోజే మైనర్ బాలిక మిస్టరీ డెత్.. కారణమెవరు..?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 28, 2019 | 6:32 PM

పుట్టిన రోజు నాడే శవమై తేలింది ఓ మైనర్ బాలిక. పుట్టిన రోజు వేడుకల కోసమని స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఆ బాలిక.. జన సంచారం లేని ప్రదేశంలో విగత జీవిగా పడిపోయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన ఓ మిస్టరీ డెత్ ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక హత్యకు గురైంది. హంటర్‌ రోడ్‌లో బాలిక మృతదేహాన్ని పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతురాలు దీన్ దయాల్ నగర్‌ కాలనీకి చెందిన మానసగా గుర్తించారు. పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి వెళ్లిన మానస.. కాసేపటికే విగత జీవిగా మిగిలింది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తును చేస్తున్నారు. అయితే బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.