బర్త్‌డే బాయ్ నాగచైతన్యకు అదిరిపోయే గిప్ట్.. లవ్‌స్టోరీ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. మాస్ లుక్‌తో కనిపిస్తున్న చైతూ..

బర్త్‌డే బాయ్ నాగచైతన్యకు లవ్‌స్టోరీ చిత్ర యూనిట్ అదిరిపోయే గిప్ట్‌నిచ్చింది. పల్లెటూరి యువకుడి పాత్రలో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది.

బర్త్‌డే బాయ్ నాగచైతన్యకు అదిరిపోయే గిప్ట్.. లవ్‌స్టోరీ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. మాస్ లుక్‌తో కనిపిస్తున్న చైతూ..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 23, 2020 | 7:11 PM

బర్త్‌డే బాయ్ నాగచైతన్యకు లవ్‌స్టోరీ చిత్ర యూనిట్ అదిరిపోయే గిప్ట్‌నిచ్చింది. పల్లెటూరి యువకుడి పాత్రలో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది. ఇందులో చైతు బనియన్ వేసుకొని రెండు చేతులతో లుంగీ మడతెడుతూ మాస్ లుక్స్‌తో నడిచి వస్తున్న తీరు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ కొందరితో స్నేహాలు బాగుంటాయి చైతుతో ఫ్రెండ్‌షిప్ అలాంటిదే అని బర్త్‌డే విషెస్ చెప్పారు. లవ్‌స్టోరీలో నాగ చైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ మూవీ ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం చైతూ, అతడి మిసెస్, టాలీవుడ్ హీరోయిన్ సమంత మాల్దీవుల పర్యటనలో ఉన్నారు. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.