Cow Birthday Celebration : గోమాతకు జన‌్మదిన వేడుకలు..ఈ రైతును అభినందించకుండా ఉండగలరా..?

గోమాతకు సీమంతం చేయటం చూశాం..కానీ, పుట్టిన రోజు వేడుకలు చేయటం ఎక్కడైనా చూశారా..? లేదు కదా..! కానీ, ఇక్కడ ఓ రైతు మాత్రం తన ఇంట పుట్టిన ఆవుకు పేరు పెట్టి, ప్రతీయేటా క్రమం తప్పకుండా జన్మదిన వేడుకలు జరిపిస్తున్నాడు.

Cow Birthday Celebration : గోమాతకు జన‌్మదిన వేడుకలు..ఈ రైతును అభినందించకుండా ఉండగలరా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 26, 2020 | 7:07 PM

Cow Birthday Celebration :  గోమాతకు సీమంతం చేయటం చూశాం..కానీ, పుట్టిన రోజు వేడుకలు చేయటం ఎక్కడైనా చూశారా..? లేదు కదా..! కానీ, ఇక్కడ ఓ రైతు మాత్రం తన ఇంట పుట్టిన ఆవుకు పేరు పెట్టి, ప్రతీయేటా క్రమం తప్పకుండా జన్మదిన వేడుకలు జరిపిస్తున్నాడు. అంతేకాదు, ఆ ఆవు పుట్టిన రోజును పురస్కరించుకుని కేక్‌కూడా కట్ చేయించి సంబరాలు జరిపిస్తున్నాడు.

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మందలపల్లికి చెందిన చెన్న రాయుడుకు ఐదుగురు కుమార్తెలు. కుటుంబ పోషణకు పదేళ్ల కిందట కొన్న ఆవు వారిని ఎంతో ఆదుకుంది. ఈ క్రమంలో అయిదేళ్ల కిందట ఆవుకు పుట్టిన దూడకు లక్ష్మీ అని పేరు పెట్టి ఏటా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. తన పిల్లలతో పాటే లక్ష్మీ పుట్టిన రోజు కూడా తమ ఇంట్లో శుభ సందర్భమే అంటున్నారు. తన కూతురు లక్ష్మీ తన కుటుంబాన్ని పోషిస్తోందంటున్నారు రైతు చెన్నరాయుడు. తన కూతుర్లకంటే, ఈ పాడి ఆవుపైనే తమకు ప్రేమ ఎక్కువని చెబుతున్నారు. అందుకే ప్రతీయేడు లక్ష్మీ పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నామని చెబుతున్నాడు. లక్ష్మీకి పుట్టిన బిడ్డ పేరును సరస్వతిగా పెట్టానని.. సరస్వతికి కూడా ప్రతి ఏడాది జన్మదిన వేడుకలు నిర్వహిస్తానని రైతు చెన్నరాయుడు తెలిపారు.

Also Read :

Crime News : దొంగలేమో అనుకున్నారు..మూకుమ్మడిగా దాడిచేశారు..చివరికి ఊహించని విషాదం…

Raja singh VS Silpa Chakrapani: ‘ఎనీ టైమ్ నేను రెడీ..రాజీనామాకు నువ్వు రెడీనా’..రాజాసింగ్‏కు శిల్పా చక్రపాణి సవాల్