Bird Flu Cases: మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ… అధికారికంగా ప్రకటించిన కేంద్రం..

Bird Flu Spread To Few More Places: కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే చెక్ పడుతుందని అంతా సంతోషిస్తున్న సమయంలోనే బర్డ్ ఫ్లూ పేరుతో మరో వైరస్ మానవాళిపైకి దూసుకొచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పక్షులు...

Bird Flu Cases: మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ... అధికారికంగా ప్రకటించిన కేంద్రం..
Bird Flu
Follow us

|

Updated on: Jan 28, 2021 | 2:53 PM

Bird Flu Spread To Few More Places: కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే చెక్ పడుతుందని అంతా సంతోషిస్తున్న సమయంలోనే బర్డ్ ఫ్లూ పేరుతో మరో వైరస్ మానవాళిపైకి దూసుకొచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పక్షులు, కోళ్లు, నెమళ్లు ఆకస్మాత్తుగా మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉంటే తాజాగా బర్డ్ ఫ్లూ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందన్న సందర్భంలో కేంద్రం చేసిన ప్రకటన మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. తాజాగా ఈ వైరస్ మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లోని పౌల్ట్రీ కోళ్లకు బర్డ్‌ప్లూ విస్తరించినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని.. నాసిక్, అకోల, బుల్ధానా, అహ్మద్‌నగర్, పుణె, సోలాపుర్, హింగోలి జిల్లాలతో పాటు గుజరాత్‌లోని భావనగర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ అటవీ డివిజన్‌, గుజరాత్‌ రాష్ట్రం జునాగఢ్‌లోని తీతర్‌ కాకుల్లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో నెమళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది.

Also Read: కుక్కను బతికించా.. చెల్లి ఆత్మనీ రప్పిస్తా.. హరర్‌ మూవీని తలపిస్తున్న మదనపల్లె కేసు..

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..