బర్ద్ ఫ్లూ భయం, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో చికెన్, కోడిగుడ్ల అమ్మకాల నిషేధం, హోటళ్లు, రెస్టారెంట్లకు అలర్ట్ సూచన

బర్ద్ ఫ్లూ భయంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అప్పుడే చికెన్, కోడిగుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు..

బర్ద్ ఫ్లూ భయం, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో చికెన్, కోడిగుడ్ల అమ్మకాల నిషేధం, హోటళ్లు, రెస్టారెంట్లకు అలర్ట్ సూచన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2021 | 6:07 PM

బర్ద్ ఫ్లూ భయంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అప్పుడే చికెన్, కోడిగుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు తమ పరిధుల్లోని వివిధ చోట్ల తాజా బ్యాన్ ఉత్తర్వులు జారీ చేశాయి. చికెన్ గానీ, కోడి గుడ్లతో చేసిన డిషెస్ గానీ కస్టమర్లకు సర్వ్ చేయరాదని హోటళ్లు, రెస్టారెంట్లను అలర్ట్ చేశాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చెంతవరకు  అన్ని మీట్,  పౌల్ట్రీ షాపులు, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎలాంటి అమ్మకాలు జరపరాదని, స్టోర్ చేయరాదని, అలాగే ప్రాసెస్ చేసిన చికెన్ మీట్ కి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. వీటిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాగా ఉడికించిన చికెన్, ఎగ్స్ మాత్రం తినాలని పేర్కొన్నారు. అటు-భోపాల్ కు పంపిన 8 బర్ద్ శాంపిల్స్ లో ఏవియన్ ఫ్లూ పాజిటివ్ కేసులు ఉన్నట్టు తేలింది. దీంతో ప్రభుత్వం అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల పౌల్ట్రీ షాపులను మూసివేశారు. ఈ పరిణామాలతో పౌల్ట్రీ మార్కెట్ల యజమానులు లబోదిబో మంటున్నారు. తమకు భారీ నష్టాలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు.

Read Also: హైదరాబాద్ నగరంలో ప్రత్యేక నిఘా, డిసెంబర్‌ 31 రాత్రి సెలబ్రేషన్లలో మునిగిపోతామంటే ఈ ఏడాది కుదరదు. Read Also:Bird Flu Virus News: ఓ వైపు కరోనా కల్లోలం, మరోవైపు బర్ద్ ఫ్లూ భయం.. దేశవిదేశాల్లో కలవరం.. మానవాళికి సవాల్.