తెరపైకి భారత గూఢచారి ‘బ్లాక్ టైగర్‌’ బయోపిక్

బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ తెరకెక్కనుంది. భారత అత్యుత్తమ గూఢచారి, మాజీ రా ఏంజెట్ ‘ద బ్లాక్ టైగర్’ రవీంద్ర కౌశిక్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘రైడ్’ చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తుండగా.. ఈ మూవీ అనంతరం రవీంద్ర బయోపిక్‌ను ఆయన సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ మూవీకి సంబంధించి రవీంద్ర […]

తెరపైకి భారత గూఢచారి ‘బ్లాక్ టైగర్‌’ బయోపిక్
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 14, 2019 | 2:11 PM

బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ తెరకెక్కనుంది. భారత అత్యుత్తమ గూఢచారి, మాజీ రా ఏంజెట్ ‘ద బ్లాక్ టైగర్’ రవీంద్ర కౌశిక్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘రైడ్’ చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తుండగా.. ఈ మూవీ అనంతరం రవీంద్ర బయోపిక్‌ను ఆయన సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ మూవీకి సంబంధించి రవీంద్ర కుటుంబం నుంచి అన్ని హక్కులను పొందారు రాజ్ కుమార్ గుప్తా.

అయితే 1952, ఏప్రిల్ 11న రాజస్థాన్‌లో జన్మించిన రవీంద్ర కౌశిక్ భారత ఇంటలిజెన్స్ సంస్థ రాలో ఏజెంట్‌గా పనిచేశారు. ఈ క్రమంలో 1975లో నబీ అహ్మద్ షాకిర్ పేరుతో పాకిస్థాన్‌కు వెళ్లిన ఆయన పాక్ ఆర్మీలో ఆడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఎంతో కీలక సమాచారాన్ని భారత్‌కు అందజేశారు. అయితే 1983లో పాక్ ఇంటలిజెన్స్‌కు రవీంద్ర పట్టుబడ్డారు. రెండేళ్ల విచారణ తరువాత ఆయనకు ఉరిశిక్షను విధించిన పాక్ కోర్టు, ఆ తరువాత జీవిత ఖైదుగా మార్చింది. ఆ తరువాత తీవ్ర అనారోగ్యంతో 2001లో మరణించారు రవీంద్ర. ఆయన సేవలకు గానూ అప్పటి హోం మినిస్టర్ ఎస్‌బీ చావన్ రవీంద్రకు బ్లాక్ టైగర్‌ అంటూ బిరుదును ఇచ్చారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?