Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 45 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 145380. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 80722. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 60491. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4167. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 71 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1991 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ మృతులు 1. మొత్తం ఇప్పటివరకు 57 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 650 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • అమరావతి: రేపు ,ఎల్లుండి టిడిపి మహానాడు. రేపు ఉదయం 10.30 కు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న చంద్రబాబు. ప్రతినిధులను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనున్న టిడిపి అధినేత చంద్రబాబు. కరోనా, లాక్ డౌన్ నిబంధనలు నేపథ్యంలో జూమ్ ద్వారా ఆన్ లైన్ లో మహానాడు నిర్వహణ. ఆన్ లైన్ ద్వారా మహానాడు లో పాల్గొననున్న 14 వేల మంది ప్రతినిధులు. 14 తీర్మానాలను ఆమోదించనున్న మహానాడు.
  • అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 8 మంది సభ్యులతో కమిటీ వేయాలని మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్ లో తెలిపిన దీపక్ రెడ్డి. నేడు విచారణ జరపనున్న హైకోర్టు.
  • హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ పెట్టిన పోస్టులను హైకోర్టు సుమోటోగా స్వీకరించటంపై హర్షం వ్యక్తంచేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ప్రభుత్వం చేస్తున్న తప్పులను హైకోర్టు అడ్డుకుంటే ప్రజా ప్రతినిధులయ్యుండి సిగ్గులేకుండా హైకోర్టు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? హైకోర్టు జడ్జిలపై పోస్టులను హైకోర్టు సుమోటోగా స్వీకరించి 49 మందికి నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తొట్టిగ్యాంగ్ ను ప్రోత్సహించటం సరికాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు పెడుతున్న ప్రభుత్వం హైకోర్టు జడ్జిలపై పోస్టులు పెట్టే వారిని ఎందుకు కాపాడుతున్నది? పోస్టులు పెట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి - రామకృష్ణ.

2019 రివైండ్: టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు ఇవే

Tollywood biopic movies, 2019 రివైండ్: టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు ఇవే

గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది టాలీవుడ్‌కు సక్సెస్ రేటు తక్కువనే చెప్పొచ్చు. ముఖ్యంగా టాప్ హీరోలకు ఈ ఏడాది పెద్దగా కలిసి రానప్పటికీ.. చిన్న హీరోలు మాత్రం తమ హవాను చూపించారు. అలాగే చిన్న బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చూపాయి. కాగా గతేడాది మహానటి టాలీవుడ్‌లో బయోపిక్‌లకు తీసేందుకు ఊతమివ్వగా.. ఈ ఏడాది ఏకంగా ఏడు బయోపిక్‌(ఎన్టీఆర్ రెండు భాగాలు కలిసి)లు తెరమీదికి వచ్చాయి. అందులో ఒకటి, రెండు మాత్రమే కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ లిస్ట్‌ ఇప్పుడు చూద్దాం

ఎన్టీఆర్ కథానాయకుడు- మహానాయకుడు:
దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌ తెరకెక్కింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రధానపాత్రలో నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు- మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇందులో ఏ భాగం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోగా.. కమర్షియల్‌గానూ ఈ రెండు మూవీలు బాక్సాఫీస్ వద్ద పరాజయంగా నిలిచాయి.

Tollywood biopic movies, 2019 రివైండ్: టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు ఇవే

యాత్ర:
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం యాత్ర. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి విమర్శకులు ప్రశంసలు కురిపించగా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

Tollywood biopic movies, 2019 రివైండ్: టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు ఇవే

సైరా నరసింహారెడ్డి:
తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని విడుదల చేశారు. అయితే అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. తెలుగు మినహా మిగిలిన ఏ భాషల్లోనూ ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది.

Tollywood biopic movies, 2019 రివైండ్: టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు ఇవే

మల్లేశం:
ఆసు యంత్రం సృష్టికర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మల్లేశం. రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించాడు. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ.. కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది.

Tollywood biopic movies, 2019 రివైండ్: టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు ఇవే

జార్జిరెడ్డి:
ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పేరు మోసిన విద్యార్థి సంఘాల నేత జార్జి రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జి రెడ్డి. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ.. కమర్షియల్‌గా పెద్ద హిట్‌ను సాధించలేకపోయింది.

Tollywood biopic movies, 2019 రివైండ్: టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు ఇవే

రఘుపతి వెంకయ్య నాయుడు:
తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం రఘుపతి వెంకయ్య నాయుడు. సీనియర్ నటుడు నరేష్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రానికి బాబ్జీ దర్శకత్వం వహించాడు. అయితే పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో పాటు సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా పరాజయంగా నిలిచింది.

Tollywood biopic movies, 2019 రివైండ్: టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు ఇవే

చూడాలి మరి వచ్చే ఏడాది ఇంకా ఎన్ని బయోపిక్‌లు టాలీవుడ్ తెర మీద సందడి చేయబోనున్నాయో.

Related Tags