Bio metric trouble జనం నెత్తిన బయో మెట్రిక్ బండ.. ద్యావుడా ఏదీ దారి?

అసలే లాక్ డౌన్ సమస్యలు.. దానికి తోడు బయో మెట్రిక్ సృష్టిస్తున్న కొత్త సమస్యలు తెలంగాణ జనం నెత్తిన బాంబు పేలుస్తున్నాయి. లాక్ డౌన్ డేస్‌లో ఏకైక దిక్కుగా మారిన రేషన్ సరుకులకు... బయో మెట్రిక్ బ్రేక్ వేస్తోంది.

Bio metric trouble జనం నెత్తిన బయో మెట్రిక్ బండ.. ద్యావుడా ఏదీ దారి?
Follow us

|

Updated on: Apr 03, 2020 | 12:55 PM

Telangana people trouble with bio metric system: అసలే లాక్ డౌన్ సమస్యలు.. దానికి తోడు బయో మెట్రిక్ సృష్టిస్తున్న కొత్త సమస్యలు తెలంగాణ జనం నెత్తిన బాంబు పేలుస్తున్నాయి. లాక్ డౌన్ డేస్‌లో ఏకైక దిక్కుగా మారిన రేషన్ సరుకులకు… బయో మెట్రిక్ బ్రేక్ వేస్తోంది. బయో మెట్రిక్ సమస్యలతో క్యూలు పెరిగిపోతుండగా.. సామాజిక దూరాన్ని కాస్తా పక్కన పెట్టేస్తున్న జనంతో అందరు రిస్క్‌ జోన్‌లోకి షిఫ్టు అవుతున్న పరిస్థితి ఏర్పడుతోందని జనం బెంబేలెత్తిపోతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా బయో మెట్రిక్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. దాంతో రేషన్ కోసం వెళుతున్న జనం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఫలితంగా జనం భారీ సంఖ్యలో గుమి కూడుతున్న పరిస్థితి. దానికి తోడు.. బయో మెట్రిక్ సర్వర్వు డౌన్ అవ్వడం.. వెరసి వందలాది మంది ప్రాణాలు రిస్కులో పడుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ కొనసాగిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ప్రతి ఒక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీకి పురమాయించింది. నిజానికి బయో మెట్రిక్ నుంచి మినహాయించాలని ఒక దశలో ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కింది స్థాయిలో బయో మెట్రిక్ విధానాన్నే అమలు పరుస్తుండడంతో జనానికి ఇబ్బందికరంగా మారుతోంది. వినియోగదారులకు బయో మెట్రిక్ అవరం లేదని చెప్పినా అది ఆచరణలో సాధ్యపడడం లేదు.

దాంతో, రేషన్ కోసం వెళుతున్న జనం.. షాపు దగ్గర భారీ సంఖ్యలో గుమి కూడుతున్నారు. సామాజిక దూరాన్ని సైతం చాలా మంది ఖాతరు చేయడం లేదు. నిత్యావసర సరుకుల అవసరం దృష్ట్యా ప్రజలు రేషన్ షాపుల దగ్గర పెద్ద సంఖ్యలో చేరడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాగే కొనసాగితే.. పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలకు ముప్పు రానున్న దరిమిలా బయో మెట్రిక్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. పొరుగునే వున్న ఏపీలో బయో మెట్రిక్‌తో సంబంధం లేకుండా ఏప్రిల్ నెలలో మూడు సార్లు రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే తరహాలో తెలంగాణలోను మినహాయింపు నివ్వాలని ప్రజలు కోరుతున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..