అన్నయ్య టైటిల్‌తో రాబోతున్న పవన్ కల్యాణ్ !

వరుస సినిమాలు ప్రకటిస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తాజాగా దసరా సందర్భంగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’ రీమేక్ అనౌన్సిమెంట్ వచ్చింది. 

  • Ram Naramaneni
  • Publish Date - 11:03 pm, Sun, 25 October 20

వరుస సినిమాలు ప్రకటిస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తాజాగా దసరా సందర్భంగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’ రీమేక్ అనౌన్సిమెంట్ వచ్చింది. ‘తెలుగు సినిమా అభిమాన పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌ ఇన్‌ ఏ హై ఓల్టేజ్‌ రోల్‌’ అంటూ పవన్ కొత్త సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ అమితమైన ఆనందంలో ఉన్నారు. అయితే మూవీ యూనిట్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ సినిమాకు చాలా ఆసక్తికరమైన టైటిల్‌ అనుకుంటున్నట్లు సమాచారం. సినిమా పేరుకు సంబంధించిన క్లూను ఈ రోజు రిలీజ్‌ చేసిన వీడియోలో వినిపించింది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నెం.12గా సిద్ధమవుతున్న ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడించలేదు.  అందులో బిజు మేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ పోసిస్తున్నారని సమాచారం అందుతోంది. అలాగే మరో కీలక పాత్రలో రానా నటిస్తాడని తెలుస్తోంది. ఈ పాత్రను మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించారు. ఈ చిత్రానికి అలనాటి హిట్‌ సినిమా ‘బిల్లా రంగా’ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్‌ పేరు బిల్లా అని సమాచారం. ఆ లెక్కన మరో కీ రోల్ పోషిస్తోంది రానా పేరు రంగా అవుతుంది. ఈ రోజు రిలీజైన వీడియోలో బ్యాగ్రౌండ్‌లో ‘బిల్లా.. రంగా’ అనే వాయిస్‌ వినిపిస్తోంది. అలా ఇదే సినిమా పేరు అని నెటిజన్లు అనుకుంటున్నారు. 1982లో వచ్చిన ‘బిల్లా రంగా’లో చిరంజీవి, మోహన్‌బాబు నటించిన విషయం తెలిసిందే.

Also Read : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ