తనపై వస్తున్న అభాండాలకు వివరణ ఇచ్చుకున్న బిల్‌గేట్స్‌

కరోనా వైరస్‌ను ఓ పథకం ప్రకారం సృష్టించి ప్రపంచం మీదకు వదిలారని, ఈ కుట్రలో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ప్రధాన భాగస్వామి అని ఆ మధ్యన సోషల్‌ మీడియాలో కథలు కథలుగా చెప్పుకున్నారు.. అవన్నీ పాపం ఆ అపరకుబేరుడి మనస్సును గాయపరిచాయేమో ఇప్పుడు పెదవి విప్పారు.. ఆ వైరస్‌కు తనకు ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటించారు.

తనపై వస్తున్న అభాండాలకు వివరణ ఇచ్చుకున్న బిల్‌గేట్స్‌
Follow us

|

Updated on: Jul 24, 2020 | 4:26 PM

కరోనా వైరస్‌ను ఓ పథకం ప్రకారం సృష్టించి ప్రపంచం మీదకు వదిలారని, ఈ కుట్రలో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ప్రధాన భాగస్వామి అని ఆ మధ్యన సోషల్‌ మీడియాలో కథలు కథలుగా చెప్పుకున్నారు.. అవన్నీ పాపం ఆ అపరకుబేరుడి మనస్సును గాయపరిచాయేమో ఇప్పుడు పెదవి విప్పారు.. ఆ వైరస్‌కు తనకు ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటించారు. ఆ మహమ్మారిని అంతం చేయడానికి తాను ఎంతగానో కష్టపడుతున్నానని, ఊహించనంత డబ్బును ఖర్చు చేస్తున్నానని, అయినప్పటికీ తనపై ఇందుకింత దుష్ర్పచారం జరుగుతున్నదో అర్థం కావడం లేదని వాపోయారాయన! దయచేసి ఇలాంటి కట్టుకథలు మానేయాలని వేడుకున్నారు. కోవిడ్‌-19ను అంతం చేసే వ్యాక్సిన్‌ త్వరగా వస్తే బాగుండని బిల్‌గేట్స్‌ చాలా మార్లు అన్నారు. ఈ విషయంలో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు అన్ని దేశాలు సహకరించాలని సూచించారు కూడా! ఎలాంటి వైరస్‌నైనా ఎదుర్కొనేందుకు ఓ వ్యాక్సిన్‌ను రెడీ చేసి పెట్టుకోవడం బెటర్‌ అని గతంలో తాను చేసిన వ్యాఖ్యకు నానా అర్థాలు తీసి, నానా రకాలుగా వక్రీకరించి తనపై అభాండాలు వేస్తున్నారని బిల్‌గేట్స్‌ అన్నారు.

కరోనా వైరస్‌ పుట్టుకకు బిల్‌గేట్సే కారకుడంటూ ఓ వీడియోను రూపొందించి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు..కోట్లాది మంది వీక్షించారు కూడా! కరోనా టీకాతో ప్రపంచంలోని 15 శాతం జనాభాను చంపేయాలన్నదే బిల్‌గేట్స్‌ లక్ష్యమన్న కామెంటు కూడా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోపై వివరణ ఇచ్చుకున్నారు బిల్‌గేట్స్‌…కరోనా వైరస్‌, సోషల్‌ మీడియాలది ఓ దుష్ట కలయిక అన్నారు గేట్స్‌. కరోనాపై పోరాడేందుకు ఇప్పటికే 250 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తానని ప్రకటించిన బిల్‌గేట్స్‌ గత 20 ఏళ్లుగా ఎన్నో సందర్భాలలో భారీగా విరాళాలు ఇచ్చారు.. అనేక దేశాలలో వైద్య సదుపాయాలను కల్పించారు. ప్రజలను టీకాలో చంపేసి డబ్బు గడించాలన్న నీచమైన మనస్తత్వం తనది కాదని, అలాంటి దుర్మార్గమైన పనలు తానేప్పుడూ చేయనని బిల్‌గేట్స్‌ తెలిపారు. తమకు వ్యాక్సిన్లతో అనుబంధం ఉన్న మాట నిజమే కానీ అది మీరు అనుకుంటున్నట్లు కాదని, నిజానిజాలేమిటో అర్థం చేసుకుంటారన్న నమ్మకం తనకుందని గేట్స్‌ వివరణ ఇచ్చుకున్నారు. అయినా తనమీద ఇలాంటి నీలాపనిందలు రావడం ఇదేం కొత్త కాదని, అయిదేళ్ల కిందట జికా వైరస్‌ బయటపడ్డప్పుడూ ఇలాంటి ఆరోపణలే కొందరు చేశారని బిల్‌గేట్స్‌ తెలిపారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!