Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

గ్యాస్ స్టేషన్లో జంబలకిడి పంబ

Bikini Men At Russian Gas Station, గ్యాస్ స్టేషన్లో జంబలకిడి పంబ

మార్కెటింగ్ లో భాగంగా చిత్రవిచిత్రమైన ఆఫర్లను ఇవ్వడం, వాటికోసం జనం ఎగబడి మరీ పాల్గొనడం మనం చూస్తూనే ఉంటాం. అయితే , అన్నిసార్లూ అనుకున్నట్టుగా ఈ మార్కెటింగ్ టాక్టిక్స్ వర్కవుట్ అవ్వవు. కొన్ని సార్లు ఆ ఐడియాలే బెడిసి కొట్టి, అసలుకే మోసం వచ్చే సంఘటనలు జరుగుతుంటాయి.. అచ్చం అలాంటి స్టోరీయే రష్యాలోనూ జరిగింది.. అదేంటంటే, రష్యాలోని సమారాలో ‘ఓల్వీ’ అనే గ్యాస్ స్టేషన్.. ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరైనా బికినీతో తమ గ్యాస్ స్టేషన్‌కు వస్తే చాలు, వారికి పెట్రోల్ ఉచితంగా పోస్తామని ప్రకటించింది. ఇలా ప్రకటించగానే మహిళలంతా బికినీల్లో వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారని , వాళ్లని చూడటానికి మరింత మంది కస్టమర్లు వస్తారని ఈ మాస్టర్ ప్లాన్ వేసారు. ప్లాన్ వరకూ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. ఇక, కస్టమర్ల వరద పారడమే తరువాయి అనుకున్నారు నిర్వాహకులు.. ఇంతలోనే తాము ఆఫర్ ఇచ్చిన రోజు కూడా రానే వచ్చేసింది.. కానీ ఇక్కడే ఆ నిర్వాహకులకు అసలు చిక్కు వచ్చి పడింది. ఎందుకంటే, మహిళలకు బదులుగా పురుషులే బికినీలు వేసుకుని వచ్చి నిర్వాహకులకి షాకిచ్చారు.

బికినీ ఏం కర్మ, టూ పీస్ డ్రెసెస్, హైహీల్స్ కూడా వేసుకొని వయ్యారాలు పోతూ ఎంచక్కా పెట్రోల్ కొట్టించుకొని వెళ్లారు చాలా మంది పురుషులు. మీరు బికినీ వేసుకుంటే ఆపర్ ఇస్తామని చెప్పారు కానీ, అది ఆడవాళ్లా మగవాళ్లా అన్నది చెప్పలేదు కదా అనుకుంటూ వచ్చిన పని కానిచ్చేసారు..ఈ ఆఫర్‌తో ఏదో ఊహించుకున్న ఆ బంక్ నిర్వాహకులకు మగాళ్లు ఇలా షాకిచ్చారు.

చెడు జరిగినా అందులో ఏదో మంచి విషయాన్ని వెతుక్కోవాలంటూ పెద్దలు చెప్పినట్టుగా, ఇందులో కూడా మంచి విషయాన్ని వెతుకున్నారు ఆ గ్యాస్ స్టేషన్ నిర్వాహకులు.. ఆడవాళ్లు వచ్చి ఉంటే, తమకి లోకల్ గానే పేరు వచ్చేదని.. ఇలా మగవాళ్లు ఆడవాళ్లలా రెడీ అయి రావడం వల్ల తమకి ఇంటర్నేషనల్ రేంజ్లో పేరు వచ్చిందంటూ తెగ సంబరపడి పోతున్నారు. మొత్తానికి, ఒక ఐడియా ఫ్లాప్ అవ్వడం కూడా కొన్ని సార్లు మంచికే అంటూ నవ్వుకుంటున్నారు ఈ గ్యాస్ స్టేషన్ నిర్వాహకులు.