వరంగల్ ఎన్ఐటీలో కళ్లు మిరుమిట్లుగొలిపే బైక్ రైసింగ్స్..

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఫెస్టివల్‌గా గుర్తింపు పొందిన స్ప్రింగ్‌స్ప్రీ వేడుకలు వరంగల్ ఎన్ఐటీలో ముగిశాయి. మూడురోజులపాటు జరిగిన ఈ వేడుకలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. అయితే.. ఎన్ఐటీ విద్యార్థులు హైస్పీడ్ బైక్స్‌తో చేసిన విన్యాసాలు ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఉన్న బైక్ రైసింగ్.. నిట్ క్యాంపస్ ఆవరణలో నిర్వహించడం కలకలం రేపుతోంది. ఎక్కడ ఏం జరుగుతోందనని కొంతమంది విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. బైక్ రైసింగ్‌లో నిట్ యువకులే […]

వరంగల్ ఎన్ఐటీలో కళ్లు మిరుమిట్లుగొలిపే బైక్ రైసింగ్స్..
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 1:00 PM

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఫెస్టివల్‌గా గుర్తింపు పొందిన స్ప్రింగ్‌స్ప్రీ వేడుకలు వరంగల్ ఎన్ఐటీలో ముగిశాయి. మూడురోజులపాటు జరిగిన ఈ వేడుకలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. అయితే.. ఎన్ఐటీ విద్యార్థులు హైస్పీడ్ బైక్స్‌తో చేసిన విన్యాసాలు ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఉన్న బైక్ రైసింగ్.. నిట్ క్యాంపస్ ఆవరణలో నిర్వహించడం కలకలం రేపుతోంది. ఎక్కడ ఏం జరుగుతోందనని కొంతమంది విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

బైక్ రైసింగ్‌లో నిట్ యువకులే కాదు.. విద్యార్థినులు సైతం పాల్గొన్నారు. వారితో పాటు అమ్మాయిలు కూడా రేసింగ్‌లో పాల్గొని మరింత బూస్ట్‌నిచ్చారు. దీంతో కుర్రకారు రెచ్చిపోయారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిట్ క్యాంపస్ అంతా బైక్ రైడింగ్ మోతతో కేక పెట్టించారు. కాగా.. బైక్ రైసింగ్ వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయని.. రైసింగ్‌ను నిషేధించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎన్ఐటీలో మాత్రం ఏకంగా బైక్ రైసింగ్ కాంపిటీషన్స్ నిర్వహించిన విద్యార్థులు కళ్లు మిరుమిట్లు గొలిపే విన్యాసాలతో ఆశ్చర్యపర్చారు. దీంతో విద్యార్థుల విన్యాసాలు విమర్శలకు దారితీస్తున్నాయి.