వీర జవాన్ల పేర్లను టాటూ వేయించుకున్నాడు

బికనీర్: రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లా దేశ భక్తిని చాటుతోంది. మొన్నటికి మొన్న ఇక్కడి కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లోకి ఎక్కాడు. ఈ ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దులో ఉంటుంది. దీంతో పాకిస్థాన్‌కు చెందిన వారు 48 గంటల్లో బికనీర్‌ను విడిచి వెళ్లిపోవాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా బికనీర్ జిల్లాకు శ్రీధుంగార్గర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సహరన్ అనే వ్యక్తి పుల్వామా ఉగ్రదాడిలో కన్నుమూసిన జవాన్లతో పాటు మొత్తం 71 మంది వీర […]

వీర జవాన్ల పేర్లను టాటూ వేయించుకున్నాడు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:35 PM

బికనీర్: రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లా దేశ భక్తిని చాటుతోంది. మొన్నటికి మొన్న ఇక్కడి కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లోకి ఎక్కాడు. ఈ ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దులో ఉంటుంది. దీంతో పాకిస్థాన్‌కు చెందిన వారు 48 గంటల్లో బికనీర్‌ను విడిచి వెళ్లిపోవాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా బికనీర్ జిల్లాకు శ్రీధుంగార్గర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సహరన్ అనే వ్యక్తి పుల్వామా ఉగ్రదాడిలో కన్నుమూసిన జవాన్లతో పాటు మొత్తం 71 మంది వీర జవాన్ల పేర్లను వీపు మీద టాటూ వేయించుకున్నాడు.

అంతేకాదు పాకిస్థాన్ మర్దాబాద్ అని కూడా రాయించుకున్నాడు. ఈ రకంగా అతను తన దేశ భక్తిని చాటుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై గోపాల్ సహరన్ స్పందిస్తూ అమర వీరులకు తన వంతుగా ఈ విధానంలో నివాళులర్పించానని, యువత తనను చూసి స్ఫూర్తి పొంది దేశ భక్తి పెంచుకోవాలని అన్నాడు.