సూపర్ ఆఫర్.. పెళ్లికి ఉల్లికి లింక్.. ఆ కార్డు చూపిస్తేనే..

ప్రస్తుతం ఉల్లి ఘాటు ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు కిలో రూ. 40 నుంచి 60 ఉండగా.. ప్రస్తుతం వంద నోటు ఇస్తే కానీ రానంటుంది. అంతాగ దీని డిమాండ్ పెరిగింది. దాదాపు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉల్లి ధరలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పెరిగిన ఉల్లి ధర నుంచి.. ప్రజలకు ఉపశమనం కల్గించేందుకు పలు రాష్ట్రాలు ధరల నియంత్రణకు శ్రీకారం చుట్టాయి. ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ […]

సూపర్ ఆఫర్.. పెళ్లికి ఉల్లికి లింక్.. ఆ కార్డు చూపిస్తేనే..
Follow us

| Edited By:

Updated on: Nov 23, 2019 | 7:48 PM

ప్రస్తుతం ఉల్లి ఘాటు ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు కిలో రూ. 40 నుంచి 60 ఉండగా.. ప్రస్తుతం వంద నోటు ఇస్తే కానీ రానంటుంది. అంతాగ దీని డిమాండ్ పెరిగింది. దాదాపు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉల్లి ధరలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పెరిగిన ఉల్లి ధర నుంచి.. ప్రజలకు ఉపశమనం కల్గించేందుకు పలు రాష్ట్రాలు ధరల నియంత్రణకు శ్రీకారం చుట్టాయి. ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఉల్లి ధర.. రూ. 80 నుంచి రూ.100 వైపుగా పరుగెడుతోంది. దీంతో ప్రభుత్వం ఉల్లి ధరకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని పాట్నాలో కిలో ఉల్లి ధర రూ.70గా ఉంది.

అయితే ఉల్లి కొనేందుకు సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బీహార్ కో ఆపరేటివ్ సొసైటీ (బిస్కోమన్) ప్రజలకు ఊరట కలిగించే చర్యలు తీసుకుంది. బిస్కోమన్ ద్వారా ప్రత్యేక ఉల్లి కౌంటర్లను ఏర్పాటు చేసింది. అంతేకాదు.. ఈ కౌంటర్లలో కిలో ఉల్లి ధర రూ.35కే అందిస్తున్నారు. అయితే దీనికి పలు కండిషన్లు పెట్టారు. సామాన్యులకు ఒక్కొక్కరికి కేవలం రెండు కిలోలు మాత్రమే అందిస్తున్నారు. అయితే ఇక ఎవరి ఇంట్లోనైనా పెళ్లి ఉంటే వారికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. వారికి పెళ్లి కార్డు చూపిస్తే.. రూ. 35 కే.. 25 కిలోల వరకు ఇస్తున్నారు.