ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసు నిందితురాలికి జేడీయూ టికెట్‌

బీహార్‌లో ఎన్నికల కోలాహలం మొదలయ్యింది.. గెలుపు గుర్రాల కోసం పార్టీలు వెతుకులాట మొదలు పెట్టాయి.. ఇప్పుడున్న రాజకీయాలకు తగినట్టుగానే అంగబలం, అర్ధబలం ఉన్నవారిని అన్వేషిస్తున్నాయి.

ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసు నిందితురాలికి జేడీయూ టికెట్‌
Follow us

|

Updated on: Oct 08, 2020 | 4:49 PM

బీహార్‌లో ఎన్నికల కోలాహలం మొదలయ్యింది.. గెలుపు గుర్రాల కోసం పార్టీలు వెతుకులాట మొదలు పెట్టాయి.. ఇప్పుడున్న రాజకీయాలకు తగినట్టుగానే అంగబలం, అర్ధబలం ఉన్నవారిని అన్వేషిస్తున్నాయి. ఇక జనతాదళ్‌ యునైటెడ్‌ అభ్యర్థుల రెండో జాబితా కూడా విడుదల చేసింది. 90 మందితో కూడిన ఆ జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు కొందరు కొత్తవారు కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ చిట్టాలో మాజీ మంత్రి మంజూవర్మకు నితీశ్‌కుమార్‌ చోటివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసులో ఆమె ప్రధాన నిందితురాలు.. బెగుసరై దగ్గర ఉన్న బర్యార్‌పూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. షెల్టర్‌ హోంలో 30 మంది బాలికలపై లైంగికదాడుల ఆరోపణలు రావడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.. దాంతో మంజూవర్మ తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.. 2018లో ఆమెను జేడీయూ నుంచి సస్పెండ్‌ కూడా చేశారు అధినేత నితీశ్‌కుమార్‌.. ఈ సంఘటనపై విచారణ జరిపిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ మంజూవర్మతో పాటు ఆమె భర్త చంద్రశేకర్‌పై కూడా అభియోగాలు దాఖలు చేసింది.. ఈ నేరంలో ప్రమేయం ఉన్న మరో 11 మందిపై కూడా అభియోగాలు దాఖలు అయ్యాయి. ఆలుమగలిద్దరూ కోర్టుకు లొంగిపోయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.. ఈ ఘటనపై సీబీఐ కూడా దర్యాప్తు చేస్తోంది.. అలాంటి మంజూవర్మకు టికెట్‌ ఇవ్వడమేమిటా అని విపక్షాలు మండిపడుతున్నాయి.. ఇంకో విచిత్రమేమిటంటే రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చిన్న కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు పిల్లనిచ్చిన మామ చంద్రికా రాయ్‌కు కూడా జేడీయూ టికెట్‌ ఇచ్చింది.. పర్సా నియోజకవర్గం నుంచి చంద్రికా రాయ్‌ పోటీ చేస్తున్నారు..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!