జేడీయూలోకి ఐదుగురు ఆర్జేడీ ఎమ్మెల్సీల జంప్

బీహార్ రాష్ట్రంలో మాత్రం పొలిటికల్ హీటెక్కింది. ఆర్జేడీ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనతాదళ్‌ యునైటెడ్ పార్టీలోకి జంప్ అయ్యారు.

జేడీయూలోకి ఐదుగురు ఆర్జేడీ ఎమ్మెల్సీల జంప్
Follow us

|

Updated on: Jun 24, 2020 | 3:49 PM

ప్రపంచ మొత్తం కరోనాతో కలవరపడుతుంటే.. బీహార్ రాష్ట్రంలో మాత్రం పొలిటికల్ హీటెక్కింది. లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ యునైటెడ్ (జేడీయూ) పార్టీలో చేరిపోయారు. జులై 6న జరగనున్న ఎమ్మెల్సీల ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు ఉపందుకున్నాయి. కొత్తగా చేరిన ఐదుగురు సభ్యులతో కలిపి శాసనమండలిలో జేడీయూ సభ్యుల సంఖ్య 21కి చేరింది. బీహార్‌ శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 75 కాగా, ప్రస్తుతం 29 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో జులై 6న తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

బీహార్ అసెంబ్లీకి అక్టోబరు-నవంబరులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. ఇప్పటి అంతర్గత విభేదాలతో పీకల్లోతు కష్టాల్లో కూరుక్కుపోయిన ఆర్జీడీకి ఇది పెద్దగా అంటున్నారు విశ్లేషకులు. త్వరలో ఇంకెంత మంది నేతలు గోడలు దూకుతారోనన్న టెన్షన్ మొదలైంది. మరోపక్క ఆర్జేడీ కూటిమిలోని చిన్న పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయం త్వరగా తేల్చాలని పట్టుబడుతున్నాయి. అటు అధికార జేడీయూ నేతలు తమ ప్రచారాన్ని ముమ్మారం చేశారు. మిత్రపక్షమైన బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఆ పార్టీ అధినేత అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రాంభించారు. దీంతో మరోసారి అధికారం తమదేనని జేడీయూ, బీజేపీ కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేతల దృష్టి అంతా ఎన్నికల షెడ్యూల్ విడుదలపై పడింది.